జోహార్‌..! సుభాష్‌ చంద్రబోస్‌

స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జన్మదినమైన జనవరి 23ను ‘పరాక్రమ్‌ దివస్‌’గా పిలుస్తారు.

Source: Eenadu

అప్పటి బెంగాల్‌ ప్రావిన్స్‌లో భాగంగా ఉన్న కటక్‌లో 1897న బోస్‌ జన్మించారు. ఆయనకు 13మంది సోదరసోదరీమణులు. 

Source: Eenadu

స్వామి వివేకానంద బోధనలపై బోస్‌ అమితాసక్తిని ప్రదర్శించేవారు.

Source: Eenadu

చదువులో చురుగ్గా ఉండే బోస్‌.. భారతీయులను అవమానించాడనే కారణంతో ప్రొఫెసర్‌ ఓటెన్‌పై ఎదురుతిరిగారు.  

Source: Eenadu

భారత సివిల్‌ సర్వీసు పరీక్షలో బోస్‌ 4వ ర్యాంకు సాధించి ఉద్యోగం పొందారు. బ్రిటిష్‌ వారికి ఊడిగం చేయడం ఇష్టంలేక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశారు.

Source: Eenadu

ఆ తరువాత ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌లో చేరి అధ్యక్షుడి స్థాయికి ఎదిగారు. గాంధీతో విభేదాలు, కాంగ్రెస్‌లోని విధానాలు నచ్చక చివరికి ఆ పార్టీని వీడారు.

Source: Eenadu

ఆస్ట్రియాకు చెందిన ఎమిలై షెంకల్‌ను ఆయన వివాహమాడారు. వారికి ఒక కుమార్తె జన్మించింది. ఆమె పేరు అనితా బోస్‌. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌, ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ను స్థాపించారు.

Source: Eenadu 

గాంధీజీ సిద్ధాంతమైన అహింస మార్గాన్ని విభేదించి.. స్వాతంత్య్రం కోసం హింసాత్మక ప్రతిఘటన చేయాలని భావించారు.

Source: Eenadu

సంపూర్ణ స్వరాజ్యం కోసం పోరాడుతూ 1921 నుంచి 1941 మధ్యకాలంలో బోస్‌ 11 సార్లు జైలుకు వెళ్లారు.

Source: Eenadu

1945, ఆగస్టు 18న తైపిలో.జరిగిన విమాన ప్రమాదంలో సుభాష్‌ చంద్రబోస్‌ మరణించారనే వాదన ఉంది.

Source: Eenadu

నేతాజీకి చెందినవిగా చెబుతోన్న చితాభస్మం నింపిన పాత్రను 1945 సెప్టెంబరులో టోక్యోలోని రెంకోజి ఆలయంలో భద్రపర్చారు. వాటికి డీఎన్‌ఏ పరీక్ష నిర్వహించాలని బోస్‌ కుమార్తె అనితా బోస్‌ ఇప్పటికీ డిమాండ్‌ చేస్తున్నారు.

Source: Eenadu

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(20-07-2025)

చిత్రం చెప్పేవిశేషాలు(19-07-2025)

Eenadu.net Home