తెలుగు తెరపై ‘భాగ్యశ్రీ’ కుమార్తె!

తొలి చిత్రం(మైనే ప్యార్‌ కియా)తోనే బాలీవుడ్‌లో స్టార్‌డమ్‌ తెచ్చుకుంది అలనాటి అందాల తార భాగ్యశ్రీ. ఇప్పుడు ఆమె వారసురాలు అవంతిక దసాని టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Image: Instagram

‘స్వాతిముత్యం’ హీరో బెల్లంకొండ గణేశ్‌ కొత్త చిత్రం ‘నేను స్టూడెంట్‌ సర్‌’లో అవంతిక హీరోయిన్‌గా నటించింది. జూన్‌ 2న ఈ చిత్రం విడుదలైంది.

Image: Instagram

రాఖీ ఉప్పలపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విద్యార్థిని శ్రుతి వాసుదేవన్‌ పాత్రలో అవంతిక కనిపించింది.

Image: Instagram

ఈ చిత్రంలో అవంతిక హీరోయిన్‌గా ఎంపిక అవడానికి ఈమె తల్లి భాగ్యశ్రీనే కారణం.

Image: Instagram 

బెల్లంకొండ శ్రీనివాస్‌ బాలీవుడ్‌ సినిమా ‘ఛత్రపతి’లో భాగ్యశ్రీ హీరో తల్లిగా నటించారు. అదే సమయంలో తన కుమార్తెను తెలుగులో లాంచ్‌ చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు శ్రీనివాస్‌కు చెప్పారట.

Image: Instagram

‘నేను స్టూడెంట్‌ సర్‌’కి కొత్త అమ్మాయినే హీరోయిన్‌గా తీసుకోవాలని చిత్రబృందం భావించడంతో అవంతికను ఖరారు చేశారు.

Image: Instagram

ముంబయిలో పుట్టి పెరిగిన అవంతిక.. లండన్‌లో ఎంబీఏ చదువుకుంది. నటనపై ఆసక్తితో తిరిగి వచ్చేసింది.

Image: Instagram

ఇటీవల ఆమె బాలీవుడ్‌లో ‘మిథ్య’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇందులో ఆమెది ప్రతినాయిక ఛాయలున్న పాత్ర. అయినా.. ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి.

Image: Instagram

అవంతిక సోదరుడు అభిమన్యు దసాని కూడా బాలీవుడ్‌ నటుడే. ఇటీవల అతడు హీరోగా నటించిన ‘నికమ్మ’ మంచి విజయాన్ని అందుకుంది.

Image: Instagram

‘నేనూ నటనవైపు వస్తానంటే మొదట్లో అమ్మ, సోదరుడు భయపడ్డారు. నేను చాలా సున్నిత మనస్కురాలిని. ఈ ఇండస్ట్రీలో ఎత్తుపల్లాలు భరించలేను అనుకున్నారు. కానీ, నటనపై నాకున్న ఇష్టాన్ని చూసి మద్దతిచ్చారు’అని చెప్పుకొచ్చింది.

Image: Instagram

అప్పటి స్టార్‌ హీరోయిన్‌ భాగ్యశ్రీ కుమార్తెగా నాకు బాలీవుడ్‌లో పరిచయాలు ఉండొచ్చు. కానీ, అవి సినీ అవకాశాలు తెచ్చి పెట్టవు. నాకు నేనుగా నిరూపించుకోవాల్సిందేనని అంటోంది అవంతిక.

Image: Instagram

‘తొలినాళ్లలో నా కుటుంబ నేపథ్యంలో ఉపయోగపడొచ్చు.. కానీ, తర్వాత కష్టాన్నే నమ్ముకోవాలి. నాకంటూ సొంత గుర్తింపును తెచ్చుకోవాలి’ అని చెబుతోంది. అదే తన లక్ష్యమట.  

Image: Instagram

అవంతికది హస్కీ వాయిస్‌. దీంతో చిన్నతనం నుంచే ఆమెను అందరూ ఎగతాళి చేసేవారట. మొదట్లో బాధపడ్డా.. ఆ తర్వాత తన వాయిసే అందరిలో తనను ప్రత్యేకంగా నిలుపుతోందన్న సానుకూల దృక్పథంతో ముందుకెళ్తోంది.

Image: Instagram

ఇండస్ట్రీలోకి రాకముందే అవంతిక ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ ఆ ఫొటోలను సోషల్‌మీడియాలో షేర్‌ చేసింది. ఈమె భాగ్యశ్రీ కుమార్తె అని తెలియడంతో నెట్టింట ఫాలోయింగ్‌ పెరుగుతోంది.

Image: Instagram

ఈ యంగ్‌ బ్యూటీకి డ్యాన్సింగ్‌, ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. తరచూ పార్టీలకు వెళ్తుంటుంది.

Image: Instagram

ఆ సీన్లకు ఎక్కువ రెమ్యూనరేషన్‌ ఇవ్వాల్సిందే!

ఈ వారం ఓటీటీలో వీటిదే సందడి

చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

Eenadu.net Home