తన్వి.. వయ్యారి తరుణి!
‘ఆర్య’, ‘అతడు’ తదితర చిత్రాల్లో బాలనటుడిగా కనిపించిన దీపక్ సరోజ్.. ‘సిద్ధార్థ్ రాయ్’తో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. దీంట్లో కథానాయికగా నటిస్తోంది.. తన్వి నేగి.
Image: Instagram/tanvinegi
‘అర్జున్‌రెడ్డి’తరహాలో తెరకెక్కిన ‘సిద్ధార్థ్ రాయ్’లో తన్వి బోల్డ్ పాత్రలో కనిపించనుంది.
Image: Instagram/tanvinegi
హీరోతో లిప్‌లాక్ పోస్టర్ చూస్తేనే ఇందులో రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది.
Image: Instagram/tanvinegi
తాజాగా చిత్రం టీజర్ లాంచ్ వేడుకలో మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే తెలుగు నేర్చుకుంటున్నానని, త్వరలో పూర్తిగా తెలుగులో మాట్లాడతానని చెప్పింది.
Image: Instagram/tanvinegi
తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్, వైజాగ్ నగరాలు తన్వికి బాగా నచ్చాయట. తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తే.. ఇక్కడే ఉండిపోతానంది.
Image: Instagram/tanvinegi
ఈ బ్యూటీ ఇది వరకు తెలుగులో ఎస్తర్ నోరోన్హా నటించిన ‘ఐరావతం’లో హీరోయిన్‌గా కనిపించింది.
Image: Instagram/tanvinegi
బాలీవుడ్‌లోనూ మెరిసింది. ‘తాజ్: డివైడెడ్ బై బ్లడ్’వెబ్‌సిరీస్‌లో జగత్ గొస్సైన్ పాత్ర పోషించింది.
Image: Instagram/tanvinegi
ఈ మధ్యే సోషల్‌మీడియాలో అడుగుపెట్టిన తన్వి.. ఇన్‌స్టాలో గ్లామర్ ఫొటోలు పోస్టు చేస్తూ యూత్‌ని ఆకట్టుకుంటోంది.
Image: Instagram/tanvinegi