ఈ విశ్వసుందరి.. డ్యాన్సర్‌, వజ్రాల వ్యాపారి

మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీల్లో డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్‌ హెల్విగ్ గెలుపొందింది. విశ్వ సుందరి విజేతల జాబితాలో తొలిసారి డెన్మార్క్‌కు చోటు కల్పించిన ఆమె గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..

125 మంది కంటెస్టెంట్లను దాటుకొని ఈ ఏడాది మిస్‌ యూనివర్స్‌ టైటిల్‌ను గెలుచుకుంది విక్టోరియా కెజార్‌ హెల్విగ్‌. 

ప్రో డ్యాన్సర్‌, వజ్రాల వ్యాపారి అయిన 21 ఏళ్ల విక్టోరియా కెజార్‌ ఈ అందాల కిరీటం అందుకున్న తొలి డెన్మార్క్‌ యువతి.

కోంగెన్స్‌ లింగ్బైలో ఉన్న లింగ్బై హ్యాండిల్స్‌జిమ్నాజియంలో బిజినెస్‌ & మార్కెటింగ్‌ చదువుకుంది. 

జంతువులు అంటే విక్టోరియాకు ప్రాణం. వాటి హక్కుల కోసం పోరాడుతుంటుంది. అలాగే మనుషుల మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కలిగిస్తూ ఉంటుంది. 

విహారయాత్రలు అంటే ఇష్టం. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ చూస్తే ట్రిప్పుల ఫొటోలే ఎక్కువగా కనిపిస్తాయి. స్నేహితులతో వేసే ట్రిప్పుల కంటే కుటుంబంతో తిరిగే విహారయాత్రలే ఎక్కువ. 

అందాల కిరీటం అందుకోవడంతోపాటు న్యాయశాస్త్రంలో డిగ్రీ పట్టా పుచ్చుకోవడం ఆమె ఆశయం. 

అందాల పోటీల్లో పాల్గొనడం కోసం గత కొన్నేళ్లుగా విక్టోరియా ప్రయత్నాలు చేస్తోంది. అలా 2022లో మిస్‌ గ్రాండ్‌ ఇంటర్నేషన్‌లో టాప్‌ 20లో నిలిచింది. 

ఆమె అందంగా తయారైతే బార్బీ డాల్‌లా ఉంటుందని.. చూడటానికి రెండు కళ్లూ చాలవు అని డెన్మార్క్‌ మీడియా ఆమెను ఆకాశానికెత్తేస్తోంది. 

 ‘‘మిస్ యూనివర్స్ ప్రపంచంలోని సవాళ్లను వినాలి. తన వేదికను ఉపయోగించుకుని ఆ సవాళ్లకు సమాధానాలు వెతకాలి. విశ్వ సుందరి.. బడుగుల గొంతుక అవ్వాలి. మనుషులు అయినా, జంతువులు అయినా వారి కష్టానికి ప్రతినిథి అవ్వాలి’’

- విశ్వసుందరి పోటీల్లో విక్టోరియా సమాధానం

ఒత్తిడిని దూరం చేసే ఆయిల్‌ మసాజ్‌

కోరుకున్న లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఈ లక్షణాలు ఉండాలి!

ఆకర్షణీయమైన నగరాల్లో టాప్-10 ఇవే!

Eenadu.net Home