ఆహా.. నిహా..

గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న నిహారిక ‘వాట్‌ ది ఫిష్‌’ చిత్రంతో రీఎంట్రీ ఇవ్వనుంది. ఇందులో ఆమె అష్టలక్ష్మి పాత్రలో నటించనుంది. మంచు మనోజ్‌ హీరో. 

This browser does not support the video element.

నిహారిక ప్రధాన పాత్రలో రానున్న ఈ మూవీ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతోంది. 

ఈమె వెబ్‌సిరీస్‌లలో అప్పుడప్పుడూ మెరుస్తూ ఉన్నా ‘సూర్యకాంతం’ తర్వాత వెండి తెరకు దూరంగా ఉంది. ఈ ఏడాది ‘డెడ్‌ పిక్సల్స్‌’తో ఓటీటీలో సందడి చేసింది.

విహార యాత్రలంటే తనకి ఎంతో ఇష్టం. స్నేహితులతో, కుటుంబంతో కలిసి విదేశాల్లో ఎక్కువగా ట్రిప్స్‌ ప్లాన్‌ చేస్తూ ఉంటుంది.

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌పై ఎక్కువగా దృష్టి పెడుతుంది. నాజూగ్గా ఉండేందుకు జిమ్‌లో ఎక్కువ సమయం గడుపుతుంది.

సినిమాలకు దూరంగా ఉన్నా సోషల్‌ మీడియాతో నేరుగా అభిమానులకు చేరువగానే ఉంటుంది. తన ఫొటో షూట్లు, ట్రిప్‌ ఫొటోలు ఇన్‌స్టాలో పంచుకుంటుంది.

This browser does not support the video element.

‘పాస్తా అంటే నాకెంతో ఇష్టం. స్వయంగా చేసుకొని లాగించేస్తాను. అమ్మ చేతి వంట, ఆవకాయ ఎక్కువగా నచ్చుతాయి’ అని చెబుతుంది. 

నిహారిక 2015లో పింక్ ఎలిఫెంట్‌ పిక్చర్స్‌ ప్రొడక్షన్‌ హౌజ్‌ స్థాపించి, దీని ద్వారా లఘు చిత్రాలు, వెబ్‌ సిరీస్‌ని నిర్మించింది. మొదటి సారిగా ఫీచర్‌ ఫిల్మ్‌ని రూపొందించనుంది.

This browser does not support the video element.

అల్లరి చేస్తూ ఇంట్లో వాళ్లతో తీసుకున్న వీడియోలు సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అవుతాయి.

మెగా కుటుంబంలోని కజిన్స్‌తో, బంధువులతో కలిసి పండుగలు, ఫంక్షన్లలో సందడి చేస్తుంటుంది. 

ఇషా చావ్లా సెకండ్‌ ఇన్నింగ్స్‌..

జాణవులే నెర ‘జాన్వి’విలే

ఈవారం ఓటీటీలో విడుదలయ్యే చిత్రాలు/సిరీస్‌లు

Eenadu.net Home