‘డ్రీమ్‌ గర్ల్‌’.. నికితా దత్త!

తన అందం అభినయంతో కుర్రకారు మనసుని దోచేసింది నికితా దత్త. image:instagram/nikifying

తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్‌ అవుతోన్న ‘ఖాకీ: ది బిహార్‌ చాప్టర్‌’ వెబ్‌ సిరీస్‌లో నటించిందీ భామ.

image:instagram/nikifying

ఈ అందాల సుందరి 1990 నవంబర్‌ 13న దిల్లీలో జన్మించింది. విద్యాభ్యాసమంతా ముంబయిలో జరిగింది.

image:instagram/nikifying

మోడలింగ్‌ చేస్తూ.. ఈ గ్లామర్‌ బ్యూటీ 2012లో ఫెమినా మిస్‌ ఇండియా లో ఫైనలిస్ట్‌గా నిలిచింది. image:instagram/nikifying

మొదట..‘లేకర్‌ హమ్‌ దీవానా దిల్‌’లో సహాయక పాత్రలో నటించి చలన చిత్రరంగంలో అడుగుపెట్టింది నికిత. కానీ, ఆ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద విఫలమైంది.

image:instagram/nikifying

ఆ తర్వాత ఈ దిల్లీ బ్యూటీ.. 2015లో ఓ టెలివిజన్‌లో ఛానల్‌లో ప్రసారమైన ‘డ్రీమ్‌ గర్ల్‌’ సీరియల్‌లో నటించింది.

image:instagram/nikifying

ఆ సీరియల్లో నికితకు మంచి గుర్తింపు లభించడంతో పలు సీరియల్స్‌, షోల్లో అవకాశాలు వచ్చాయి. అలా రెండేళ్లపాటు నికిత.. బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.

image:instagram/nikifying

మళ్లీ సినిమా అవకాశం రావడంతో 2018లో అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన ‘గోల్డ్‌’తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చింది నికిత.

image:instagram/nikifying

ఆ తర్వాత వరసపెట్టి ‘కబీర్‌ సింగ్‌’, ‘మస్కా’, ‘ది బిగ్‌ బుల్‌’, ‘రాకెట్‌ గ్యాంగ్‌’ తదితర సినిమాల్లో నటించింది. పలు మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లోనూ మెరిసింది.

image:instagram/nikifying

వెబ్‌సిరీస్‌లతోనూ మెప్పిస్తోంది. 2019లో ‘ఆఫట్‌’లో నటించిన నికిత.. తాజాగా ‘ఖాకీ...’లోనూ కీలక పాత్ర పోషించింది.

image:instagram/nikifying

ఎప్పటికప్పుడు తన హాట్‌ పిక్స్‌ను అభిమానులతో పంచుకుంటుందీ భామ. ఇన్‌స్టాలో 1.2మిలియన్ల ఫాలోవర్లున్నారు.

image:instagram/nikifying

This browser does not support the video element.

అందం, ఫిట్‌నెస్‌ కోసం వ్యాయామంతోపాటు యోగా చేస్తుంటుంది.

image:instagram/nikifying

This browser does not support the video element.

ట్రావెలింగ్‌ అంటే ఎంతో ఇష్టపడుతుంది. వీలు దొరికినప్పుడల్లా విదేశాల్లో షికారు కొట్టేందుకు సిద్ధపడుతుంది.

image:instagram/nikifying

పచ్చందనమే.. పచ్చదనమే

‘హిట్‌’ కొట్టేసిన మీనాక్షి చౌదరి!

పెళ్లి పీటలెక్కనున్న ‘అతియా శెట్టి’

Eenadu.net Home