నిక్కీ తంబోలి.. బాలీవుడ్‌పైనే గురి!

వెండితెరపై గుర్తింపు రాకున్నా.. సోషల్‌మీడియాలో పాపులారిటీ సంపాదించింది.. నటి నిక్కీ తంబోలి.

Image: Instagram/Nikki Tamboli

‘చీకటి గదిలో చితక్కొట్టుడు’, ‘కాంచన 3’, ‘తిప్పరా మీసం’ చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులను పలకరించిన నిక్కీ.. ఇటీవల విడుదలైన ‘జోగిరా సారా రారా’లోని ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది.

Image: Instagram/Nikki Tamboli

తొలిసారిగా ఓ బాలీవుడ్‌ పాటలో కనిపించిన ఈ బ్యూటీ హీరోయిన్‌గా నటించే అవకాశాల కోసం ఎదురుచూస్తోంది.

Image: Instagram/Nikki Tamboli

నిక్కీ.. 1996 ఆగస్టు 21న మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లో జన్మించింది. 2019లో మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

Image: Instagram/Nikki Tamboli

మోడలింగ్‌ చేస్తోన్న సమయంలోనే ‘చీకటి గదిలో..’ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశమొచ్చింది. అదే తనకు తొలి సినిమా. 

Image: Instagram/Nikki Tamboli

ఆ తర్వాత తమిళ్‌, తెలుగులో పలు సినిమాలు చేసినా నిక్కీకి పెద్దగా గుర్తింపు దక్కలేదు. 

Image: Instagram/Nikki Tamboli

ఇక 2020లో ప్రసారమైన బిగ్‌బాస్‌ సీజన్‌ 14లో పాల్గొన్న నిక్కీ.. ఆ రియాల్టీ షోలో రెండో రన్నరప్‌గా నిలిచింది. దీంతో బీటౌన్‌లో కాస్త పాపులారిటీ వచ్చింది.

Image: Instagram/Nikki Tamboli

మరో రియాల్టీ షో ‘ఖత్రోన్‌ కె ఖిలాడీ’ సీజన్‌ 11లోనూ ఈ బ్యూటీ పాల్గొని సాహసాలు చేసింది. ఇవి కాకుండా పలు మ్యూజిక్‌ వీడియోల్లోనూ ఆడిపాడింది. 

Image: Instagram/Nikki Tamboli

‘ఇక టీవీ షోలు చేయను. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇవ్వడంమైనే నా దృష్టి ఉంది.’అని తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. 

Image: Instagram/Nikki Tamboli

సోషల్‌మీడియాలో నిక్కీకి మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఇన్‌స్టాలో 4 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు.

Image: Instagram/Nikki Tamboli

సినిమాలు లేకపోయినా.. ఎప్పటికప్పుడు తన గ్లామర్‌ ఫొటోలు పోస్టు చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Nikki Tamboli

మలయాళంలో టాప్‌ 10 సినిమాలు ఇవే!

ఈ వారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

మీర్జాపూర్‌ గర్ల్‌.. హర్షితా గౌర్‌

Eenadu.net Home