నీతా అంబానీ.. అరవైల్లోనూ ఎంతో ఫిట్‌..!

రిలయన్స్‌ ఫౌండేషన్‌ అధినేత్రి నీతా అంబానీ ఆరుపదుల వయసులోనూ అందంగా, ఇంత ఫిట్‌గా ఎలా ఉన్నారో తెలుసా..? 

ఆమె ప్రతి రోజు తెల్లవారుజామునే మేల్కొని ఓ గంట పాటు వాకింగ్‌ చేస్తారు. తను ఇంత ఆరోగ్యంగా, యవ్వనంగా ఉండేందుకు రహస్యమిదే అంటున్నారు నీతా.

ఆహారం విషయంలో కఠినమైన నియమాలు పెట్టుకుంటారట. టిఫిన్‌ కోసం డ్రైఫ్రూట్స్‌, జ్యూస్‌లు మాత్రమే తీసుకుంటారు.

రోజూ బీట్‌రూట్‌ జ్యూస్‌ తాగడం వల్ల తన రక్తపోటు అదుపులో ఉంటుందట. అంతే కాకుండా శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. చర్మం కూడా నిగారిస్తుంది.

This browser does not support the video element.

ఎన్ని పనులున్నా ఆమె ఫిట్‌నెస్‌ సెషన్స్‌ను మాత్రం నిర్లక్ష్యం చేయరు. యోగా, స్మిమ్మింగ్, వ్యాయామాలు చేస్తుంటారు.

నీతా తీసుకునే ఆహారంలో ఎక్కువ శాతం ద్రవాహారమే ఉంటుందట. ఇవి శరీరాన్ని హైడ్రేటెడ్‌గా, చర్మాన్ని తాజాగా ఉంచుతాయి.

ఆకుకూరలు, కూరగాయలు బాగా తింటారు. ఉడకబెట్టిన కూరగాయల్లో విటమిన్స్‌, మినరల్స్‌ ఎన్నో పోషకాలు లభిస్తాయి. 

రాత్రి భోజనంలో మొలకలు, కూరగాయలు, వెజ్‌సూప్‌ తీసుకుంటారు. ఇవి జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి.. బరువు పెరగకుండా చూస్తాయట. 

చక్కెరతో చేసిన పదార్థాలు, ప్రాసెస్డ్‌ ఫుడ్‌కు దూరంగా ఉంటారు. ఇంట్లో చేసే వంటకాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు.

వర్షాకాలంలో రోడ్‌ ట్రిప్‌.. ఈ దారుల్లో అద్భుతం..

ఒత్తిడిని జయించేందుకు నిపుణుల సలహాలివే..!

ట్రావెల్‌ డిటెక్టివ్‌.. ఆన్వీ కామ్‌దార్‌

Eenadu.net Home