నచ్చింది తినేయండి..

చాలా మంది స్లిమ్‌గా ఉంటేనే అందంగా కనిపిస్తామని భావిస్తారు. అందుకోసం, రకరకాల డైట్స్‌ పాటిస్తూ ఆకలిని చంపేసుకొని, శరీరాన్ని కష్టపెడతారు. ఇది అంత మంచి పద్ధతి కాదని నిపుణులు చెబుతున్నారు.

మనుషుల్లో అందరి శరీరతత్వం ఒకలా ఉండదని.. మనలోని జన్యువులు, అలవాట్లు, జీవిస్తున్న వాతావరణం కూడా శరీరాన్ని ప్రభావితం చేస్తాయని అంటున్నారు.

దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించడం కోసమే.. ఏటా మే 6న అంతర్జాతీయ నో డైట్ డే నిర్వహిస్తుంటారు. బాడీషేమింగ్‌ చేయకుండా అందరినీ ఒకేలా చూడాలన్నదే నో డైట్‌ డే లక్ష్యం.

అయినా, చాలా మంది డైట్‌ పాటిస్తూనే ఉంటారు. అందుకే, ఈ ఒక్క రోజైనా నోరు కట్టేసుకోకుండా నచ్చిన ఆహారం.. తింటూ ఎంజాయ్‌ చేయమంటున్నారు. అసలు ఈ రోజు ఎలా ప్రారంభమైందో తెలుసా?

ముప్పై ఏళ్ల కిందట.. అమెరికాకు చెందిన మేరీ ఇవాన్స్‌.. మోడల్స్‌, హీరోయిన్లలా తాను నాజుగ్గా కావాలనుకుంది. తింటే లావు అయిపోతామేనని తినడం మానేసింది. దీంతో అనెరెక్సియా బారిన పడింది. 

ఈ వ్యాధి బారినపడిన వాళ్లు.. శరీరం ఎంత బక్కచిక్కిపోయినా ఆహారం తీసుకోవాడానికి ఇష్టపడరు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సహాయంతో మేరీ ఈ వ్యాధి నుంచి బయటపడింది. 

తనలా ఇంకెవరూ బాధపడకూడదని నో డైట్‌ డే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 1992లో మే 5న ఆమె తొలి నో డైట్‌ డేని నిర్వహించింది. అమెరికాలోని కొన్ని రాష్ట్రాల సూచన మేరకు తేదీని మే6కి మార్చింది. 

కొన్నాళ్లకు ప్రపంచవ్యాప్తంగా ఈ నో డైట్‌ డేని నిర్వహించుకోవడం మొదలుపెట్టారు. సహజంగా ఉన్న శరీరతత్వాన్ని యథతథంగా స్వీకరించే గుణాన్ని అలవరుచుకోవాలని సూచిస్తున్నారు.

నలుపు ఛాయలా ఇవి ట్రై చేయండి..!

పెదవులు పొడిబారకుండా..ఇవి ట్రై చేయండి

తెలివితేటలకు కొలమానాలేంటో తెలుసా?

Eenadu.net Home