#eenadu

నాలుగేళ్లకోసారి జరిగే ప్రపంచ క్రీడా వేడుక.. ఒలింపిక్స్‌. ఈ ఏడాది జులై 26న పారిస్‌ వేదికగా ప్రారంభమైంది. భారత్‌ తరఫున 117 మంది క్రీడాకారులు పోటీపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్స్‌ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చూద్దామా...

ఒలింపిక్‌ లోగోలో ఉండే ఐదు రింగులు.. ఓషియానా, ఆఫ్రికా, అమెరికా, ఆసియా, యూరప్‌ ఖండాలకు ప్రతీక. కనిపించే నీలం, పసుపు, నలుపు, ఆకుపచ్చ, ఎరుపు రంగుల్లో ఏదో ఒకటి.. ప్రతి దేశపు జాతీయ పతాకంలో ఉంటుంది.

ఒలింపిక్‌ క్రీడలు ప్రారంభమయ్యే 100 రోజుల ముందు సంప్రదాయం ప్రకారం గ్రీస్‌లోని ఒలింపియాలో ఒలింపిక్‌ టార్చ్‌ను వెలిగిస్తారు. క్రీడలు ముగిసే వరకు ఒలింపిక్‌ టార్చ్‌ వెలుగుతూనే ఉండాలి.

తొలి ఒలింపిక్‌ క్రీడలు క్రీస్తుపూర్వం 776లో గ్రీకు సంప్రదాయాల్లో భాగంగా జరిగేవి. దాదాపు ఆరు నెలలపాటు కొనసాగే ఈ పోటీల్లో రెజ్లింగ్‌, బాక్సింగ్‌, లాంగ్‌ జంప్‌, జావెలిన్‌ త్రో, డిస్కస్‌, రథాల పోటీలు ఉండేవి. 

క్రీస్తుశకం 393లో పలు కారణాలతో ఒలింపిక్‌ పోటీలను నిషేధించారు. 1500 ఏళ్ల తర్వాత మోడ్రన్‌ ఒలింపిక్స్‌ పేరుతో 1896లో మళ్లీ ప్రారంభమైన ఈ క్రీడాసంబరాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. 

మొదట్లో సమ్మర్‌ ఒలింపిక్స్‌ నిర్వహించిన ఏడాదే వింటర్‌ ఒలింపిక్స్‌ కూడా జరిగేవి. ప్రస్తుతం సమ్మర్‌ ఒలింపిక్స్‌ పూర్తయిన రెండేళ్ల తర్వాత వింటర్‌ ఒలింపిక్స్‌ నిర్వహిస్తున్నారు. 

సమ్మర్‌, వింటర్‌ ఒలింపిక్స్‌ మాత్రమే కాదు.. దివ్యాంగుల కోసం పారాఒలింపిక్స్‌, 15 నుంచి 18 ఏళ్లు ఉండే యువత కోసం యూత్‌ ఒలింపిక్స్‌ కూడా నిర్వహిస్తున్నారు.

ఒకప్పుడు పెయింటర్స్‌, శిల్పులు, ఆర్కిటెక్చర్స్‌, రైటర్స్‌, మ్యుజీషియన్స్‌ కూడా ఈ ఒలింపిక్స్‌లో పోటీపడేవారు. వారి కళలతో మెడల్స్‌ సాధించేవారు. 1948 తర్వాత వారికి పోటీలు నిర్వహించడం ఆపేశారు. 

పోటీల్లో విజేతగా నిలిచిన వారికి ఇచ్చే బంగారు పతకం 1912 వరకూ పూర్తిగా బంగారంతో చేసేవారు. ప్రస్తుతం ఆ పతకంలో ఉండే బంగారం కేవలం 6 గ్రాములే. మిగతాదంతా వెండి లేదా రీసైకిల్‌ చేసిన మెటల్స్‌.

పతక విజేతలు దాన్ని కొరుకుతూ ఫొటోలకు పోజులివ్వడం చూసే ఉంటారు కదా..! నిజానికి అప్పట్లో పతకం బంగారంతో చేసిందేనా కాదా అని పరీక్షించడానికి అలా చేసేవారట. కాలక్రమంలో అదో సంప్రదాయంగా మారింది. 

ఇప్పుడు 900.. 1000 గోల్స్‌ నా కల..క్రిస్టియానో రొనాల్డో

పారాలింపిక్స్‌.. మనోళ్లు అదుర్స్‌

టెస్టు క్రికెట్.. బంగ్లాదేశ్‌ చేతిలో ఓడిన జట్లు ఇవే

Eenadu.net Home