సోగకళ్ల వయ్యారి.. ఈ పాకిస్థాన్‌ సుందరి!

బాలీవుడ్‌లో శ్రీదేవి నటించిన ‘మామ్‌(2017)’తో భారతీయ తెరపై మెరిసింది.. పాకిస్థానీ నటి సజల్‌ అలీ. ఇందులో శ్రీదేవికి కుమార్తెగా కనిపించింది.

Image: Instagram/sajalaly

ఇటీవల ‘వాట్స్‌ లవ్‌ గాట్‌ టుడూ విత్‌ ఇట్‌?’ అనే చిత్రంతో హాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.

Image: Instagram/sajalaly

సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ.. మళ్లీ బాలీవుడ్‌ చిత్రాల్లో నటించాలని ఉందంటూ తన మనసులో మాట బయటపెట్టింది.

Image: Instagram/sajalaly

భారత్‌తో సజల్‌కి మంచి అనుబంధం ఉందట. ఇక్కడ కూడా తనకో ఇల్లు ఉంటే బాగుండని అనుకుంటూ ఉంటుందట.

Image: Instagram/sajalaly

ఈ అందాల సుందరి.. పాకిస్థాన్‌లోని లాహోర్‌లో 1994 జనవరి 17న జన్మించింది. ఈమె సోదరి కూడా నటే.

Image: Instagram/sajalaly

చిన్నతనంలోనే మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించి 2009లో పాక్‌ టీవీ షో ‘నాదానియాన్‌’తో నటిగా మారింది. ఆ తర్వాత ‘చాందినీ’ సీరియల్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకుంది. 

Image: Instagram/sajalaly

అదే జోరుతో 30కిపైగా టీవీ సీరియల్స్‌.. టీవీ షోలు, 10కిపైగా టెలీఫిల్మ్స్‌లో నటించింది.

Image: Instagram/sajalaly

తొలిసారి 2016లో ‘జిందగీ కిత్నీ హసీన్‌ హే’తో పాకిస్థాన్‌ సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. మరుసటి ఏడాదే ‘మామ్‌’తో బాలీవుడ్‌లో తళుక్కుమంది.

Image: Instagram/sajalaly 

శ్రీదేవి తనను జాన్వీకపూర్‌, ఖుషీకపూర్‌తో సమానంగా కుమార్తెగానే చూసుకుందని గుర్తు చేసుకుంది. జాన్వీతో ఇప్పటికీ టచ్‌లో ఉంటానని చెప్పింది.

Image: Instagram/sajalaly

బాలీవుడ్‌లో అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు గానీ.. అవకాశం వస్తే కచ్చితంగా నటిస్తానని అంటోంది సజల్‌.

Image: Instagram/sajalaly

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home