పరువాల సుందరి.. పలక్‌ లాల్వానీ

కోలీవుడ్‌లో అరుణ్‌ విజయ్‌ హీరోగా నటించిన ‘సినమ్‌’ విడుదలై మంచి హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఆ చిత్రాన్ని తాజాగా తెలుగులో ‘ఆక్రోశం’ పేరుతో విడుదలైంది. ఇందులో కథానాయికగా నటించింది పలక్‌ లాల్వానీ.

Image: Instagram/Pallak Lalwani

ఏడేళ్ల కిందట తెలుగు తెరకు పరిచయమైన ఈ ఉత్తరాది భామ.. చేసింది తక్కువ సినిమాలే అయినా.. అందంతో ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Pallak Lalwani

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో 1996 జనవరి 1న జన్మించింది పలక్‌. ఈమె తండ్రి జితిన్‌ లాల్వానీ ప్రముఖ బుల్లితెర నటుడు.

Image: Instagram/Pallak Lalwani

సైకాలజీ, ఫిలాసఫీలో డిగ్రీ చేసిన పలక్‌.. తండ్రి బాటలోనే నడుస్తూ నటనలో ఓనమాలు నేర్చుకుంది. సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా.. టాలీవుడ్‌ నుంచే తొలి అవకాశం లభించింది.

Image: Instagram/Pallak Lalwani 

డిగ్రీ చదువుతున్న సమయంలోనే నాగశౌర్య హీరోగా 2016లో వచ్చిన ‘అబ్బాయితో అమ్మాయి’తో తెరంగేట్రం చేసింది. 

Image: Instagram/Pallak Lalwani

ఆ తర్వాత ‘జువ్వ’, ‘క్రేజీ క్రేజీ ఫీలింగ్‌’లో నటించింది. ఆ సినిమాలేవీ పెద్దగా సక్సెస్‌ కాలేదు.

Image: Instagram/Pallak Lalwani 

బాలీవుడ్‌లో రవిశంకర్‌ సంగీతం సమకూర్చిన ‘దిల్‌ జఫ్రాన్‌’ అనే మ్యూజిక్‌ ఆల్బమ్‌లోనూ పలక్‌ నటించింది.

Image: Instagram/Pallak Lalwani

This browser does not support the video element.

ప్రస్తుతం కోలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. ఈ క్రమంలోనే 2019లో ‘కుప్పాతు రాజా’లో నటించింది. సినిమా ఫర్వాలేదనిపించడంతో పలక్‌కు అవకాశాలు వస్తున్నాయి.

Image: Instagram/Pallak Lalwani

ఇప్పటికే ‘సిక్సర్‌’, ‘సినమ్‌(ఆక్రోశం)’లో నటించిన ఈ ‘తారా జువ్వ’ చేతిలో మరో రెండు చిత్రాలున్నాయి. త్వరలోనే అవీ విడుదల కానున్నాయి.

Image: Instagram/Pallak Lalwani

పలక్‌.. నిత్య మీనన్‌, సాయి పల్లవి చిత్రాలు చూసి తెలుగు నేర్చుకుందట. మహేశ్‌ బాబు తన అభిమాన నటుడని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Image: Instagram/Pallak Lalwani

This browser does not support the video element.

ఈ యూపీ భామ.. మంచి డ్యాన్సర్‌. బెల్లీ డ్యాన్స్‌ అదరగొడుతోంది. తరచూ తన డ్యాన్స్‌ వీడియోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది.

Image: Instagram/Pallak Lalwani

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home