చమ్కీలా సుందరి...

‘మిషన్‌ రాణి గంజ్‌’తో ఆకట్టుకున్న బాలీవుడ్‌ బ్యూటీ పరిణీతి చోప్రా ఇప్పుడు ‘అమర్‌ సింగ్‌ చమ్కీలా’తో ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకొచ్చింది.  

పంజాబ్‌కు చెందిన ప్రముఖ గాయకుడు అమర్‌ సింగ్‌ బయోపిక్‌ ఇది. పరిణీతి ఇందులో అమర్‌ సింగ్‌ భార్య అమర్‌జ్యోత్‌ కౌర్‌ పాత్రలో నటించింది. 

ఈమె పూర్తిగా ఆ పాత్రలో ఒదిగిపోయి అచ్చం అమర్‌జ్యోత్‌ లాగానే కనిపించిందని విమర్శకుల నుంచీ ప్రశంసలు వస్తున్నాయి.

‘‘ఈ చిత్రంలో నేను పాటలు పాడిన విధానం అందరినీ ఆశ్చర్యపర్చింది. నా భర్త మొదట్నుంచీ ఈ సినిమా పెద్ద హిట్‌ అవుతుంది అనేవారు’’ అని చెబుతోందీ బ్యూటీ. 

గతేడాది సెప్టెంబరులో ఆమ్‌ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్‌ చద్దాని పరిణీతి ప్రేమించి పెళ్లాడింది. దీంతో ‘సినిమా-రాజకీయం’ జోడీలో వీరూ చేరిపోయారు. 

‘నా భర్తకి సినిమాల గురించి, నాకు రాజకీయాల గురించి ఏమీ తెలియవు. అందుకే, మేం మాట్లాడుకునేటప్పుడు పని గురించి కాకుండా పర్సనల్స్‌ మాత్రమే ఉంటాయి’ అంటోంది.

పరిణీతి ‘చమ్కీలా..’లో లావుగా కనిపించేందుకు బరువు పెరిగింది. ఇందుకు తనకు విద్యాబాలన్‌ స్ఫూర్తిగా నిలిచారని చెప్పింది. ‘డర్టీ పిక్చర్‌’ కోసం విద్యాబాలన్‌ బరువు పెరిగిన విషయం తెలిసిందే.

This browser does not support the video element.

షూటింగ్‌ తర్వాత పెరిగిన బరువును తగ్గించేందుకు జిమ్‌లో బాగానే కష్టపడింది. మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేస్తూ వ్యాయామాలు చేయడంతో పెద్దగా శ్రమ అనిపించలేదట. 

గతంలో సినిమాల ఎంపికలో ఎన్నో పొరపాట్లు జరిగాయట. ఇకపై అలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తగా కెరీర్‌పై దృష్టి పెడతానని ఓ సందర్భంలో తెలిపింది.

ఈమె వర్క్‌లైఫ్‌కి ఎంత ప్రాముఖ్యత ఇస్తుందో వ్యక్తిగత జీవితానికి కూడా అంతే సమయాన్ని కేటాయిస్తుంది. పార్టీలు, పండుగల సమయాల్లో మరింత ఆకర్షణగా నిలుస్తుంది.

ఖాళీ సమయం దొరికితే భర్తతో కలిపి ట్రిప్‌ ప్లాన్ చేస్తుంటుంది. పచ్చని ప్రకృతిని, జలపాతాల్ని ఎక్కువగా ఇష్టపడే పరిణీతి.. ట్రిప్‌ కోసం అలాంటి ప్రాంతాలనే ఎంచుకుంటుంది.

కేన్స్‌లో హాలీవుడ్‌ సొగసులు

‘విశ్వంభర’లో ఆషికా రంగనాథ్‌

సొంత అవుట్‌ ఫిట్‌తో కేన్స్‌కు!

Eenadu.net Home