పాయల్‌.. ‘మంగళవారం’పై ఆశలు!

‘ఆర్‌ఎక్స్‌ 100’లో అందాల ఆరబోతతోపాటు అభినయం ప్రదర్శించి యువ హృదయాలను దోచుకున్న నటి పాయల్‌ రాజ్‌పుత్‌. ‘మంగళవారం’ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..

‘ఆర్‌ఎక్స్‌ 100’ దర్శకుడు అజయ్‌ భూపతే ‘మంగళవారం’ని తెరకెక్కించారు. శైలజగా డీ గ్లామర్‌ రోల్‌లో కనిపించనుంది పాయల్‌. విడుదల: నవంబరు 17.

కిడ్నీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతూనే చిత్రీకరణలో పాల్గొంది. ఈ సినిమా తనకు ఓ వరమని చెబుతోంది. 

కెరీర్‌ విషయంలో కొంతకాలం క్రితం వరకు గందరగోళంలో ఉన్నానని, ఎవరి సాయం తీసుకోవాలో అర్థం కాలేదని చెప్పింది. ‘మంగళవారం’ కమ్‌బ్యాక్‌ ఫిల్మ్‌గా పేర్కొంది.

‘సప్నో సే భరే నైనా’ అనే హిందీ సీరియల్‌తో నటిగా మారింది. పంజాబీ సినిమా ‘ఛన్న మెరెయా’తో హీరోయిన్‌గా తెరంగేట్రం చేసింది. 2018లో టాలీవుడ్‌లో అడుగుపెట్టింది.

ఆ తర్వాత పాయల్‌కు వరస అవకాశాలు దక్కాయి. ‘ఆర్డీఎక్స్‌ లవ్‌’, ‘వెంకీమామ’, ‘డిస్కోరాజా’, ‘తీస్‌మార్‌ఖాన్‌’, ‘జిన్నా’ తదితర తెలుగు సినిమాలతోపాటు పంజాబీ, తమిళ, కన్నడ సినిమాల్లో నటించింది. 

‘సీత’లో ప్రత్యేక గీతంలో కనిపించి అలరించింది. ‘3 రోజెస్‌’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంది. 

దిల్లీకి చెందిన పాయల్‌కు పుస్తక పఠనం, విహార యాత్రలు చేయడం ఇష్టం.

సౌరభ్‌ అనే వ్యక్తితో ప్రేమలో ఉంది.

తెలుగు హీరో.. మలయాళీ విలన్‌!

‘యానిమల్‌’ త్రిప్తి గురించి తెలుసా?

సిల్క్‌స్మితగా చంద్రిక

Eenadu.net Home