డాక్టర్.. యాక్టర్‌.. త్వరలో డైరెక్టర్‌

‘ప్రియురాలు’తో సినీ రంగంలోకి అడుగుపెట్టిన కామాక్షి భాస్కర్ల ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర 2’తో మరోసారి ప్రేక్షకులను అలరిస్తోంది.

‘పొలిమేర 2’లో లక్ష్మి పాత్ర ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. నాకు డైరెక్షన్ అంటే ఇష్టం.. అందుకే ఈ చిత్రానికి డైలాగ్స్ రాయడమే కాకుండా అసిస్టెంట్ డైరెక్టర్‌గానూ చేశాను అని చెప్పింది.

కామాక్షి హైదరాబాద్‌లో పుట్టింది. చైనాలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసి తిరిగొచ్చింది. అపోలో ఆసుపత్రిలో కొన్ని రోజులు డాక్టర్‌గా పనిచేసింది.

నటన మీద ఆసక్తితో మోడలింగ్‌లో తొలి అడుగు పెట్టి... 2018లో మిస్‌ తెలంగాణగా ఎంపికైంది. అప్పుడే వైద్య వృత్తిని వదిలేసి పరిశ్రమ వైపు వచ్చేసింది.

‘విరూపాక్ష’, ‘పొలిమేర 1’, ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచిలర్’, ‘రౌడీ బాయ్స్‌’, ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ వంటి చిత్రాల్లో అలరించింది.

‘విరూపాక్ష’లో, హీరోయిన్‌ తల్లిగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ‘సైతాన్‌’, ‘ఝూన్సీ’, ‘కుబూల్ హై’ వంటి వెబ్‌ సిరీస్‌ల్లోనూ నటించింది. 

‘అన్నింటిలోనూ అమ్మే నాకు స్ఫూర్తి. పుస్తకాలు చదవడం నా హాబీ.. చలం రచనలు బాగా చదువుతాను. క్లాసికల్ డ్యాన్స్‌ అంటే ఇష్టం’ - కామాక్షి

‘‘ఇండస్ట్రీలో బంధువులు, తెలిసిన వాళ్లు చాలా మంది ఉన్నారు. కానీ ఎవరి సాయం తీసుకోలేదు. సొంతంగా ఎదగడమే ఇష్టం. అలాగే సినిమాల్లో అవకాశాలు దక్కించుకున్నాను’’

‘మాన్షన్ హౌస్’, ‘మల్లేష్‌’ చిత్రాల్లోనూ ఈమే నాయిక. ‘దూత’ వెబ్‌సిరీస్‌ విడుదలకు సిద్ధంగా ఉంది.

సంప్రదాయ చీర కట్టు అంటే భలే ఇష్టమట. ఇన్‌స్టాలో ఆ ఫొటోలే ఎక్కువగా కనిపిస్తాయి. ఇక హైదరాబాద్ బిర్యానీ అంటే లొట్టలేస్తుందట.

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home