బాపు గారి బొమ్మో.. మల్లె పూల కొమ్మో!

ప్రణీత.. ‘బావ’, ‘అత్తారింటికి దారేది’,‘హలో గురు ప్రేమ కోసమే’ తదితర చిత్రాలతో టాలీవుడ్‌ తెరపై సందడి చేసింది. 

Image: Instagram/Pranita Subhash

పవన్‌ కల్యాణ్‌తో బాపు గారి బొమ్మో అంటూ పొగిడించుకున్న ఈ బ్యూటీ.. ప్రస్తుతం తెలుగు సినిమాలకు దూరంగా ఉన్నా.. ఇతర భాషల్లో బిజీగా ఉంది. 

Image: Instagram/Pranita Subhash

పెళ్లయి.. ఓ బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత శరీరంలో మార్పులు సహజం. కాస్త బొద్దుగా మారిపోతుంటారు. కానీ, ప్రణీత మాత్రం స్లిమ్‌గా.. తరగని అందంతో ఆకట్టుకుంటోంది.

Image: Instagram/Pranita Subhash 

తల్లయిన తర్వాత కూడా తన గ్లామర్‌ ఫొటోలతో సోషల్‌మీడియాలో తనకున్న క్రేజ్‌ను కొనసాగిస్తోంది. ఈ బ్యూటీకి ఇన్‌స్టాలో 6.1 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Image: Instagram/Pranita Subhash

తాజాగా బ్లాక్‌ శారీలో దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేయగా.. తెగ వైరలవుతున్నాయి.

Image: Instagram/Pranita Subhash

బెంగళూరులో పుట్టి పెరిగిన ప్రణీతకు కన్నడలో ‘పోర్కీ(2010)’తో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఆ తర్వాత సిద్ధార్థ్‌ ‘బావ’తో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. 

Image: Instagram/Pranita Subhash

తెలుగు, తమిళ్‌, కన్నడ భాషల్లో 25కిపైగా సినిమాలు చేసిన ఈ కన్నడ బ్యూటీ.. ‘హంగామా 2’తో బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టింది. 

Image: Instagram/Pranita Subhash

సినిమాలే కాదు.. పలు నగల, వస్త్ర దుకాణాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. బెంగళూరులో ఓ రెస్టారెంట్‌ను నిర్వహిస్తోంది. 

Image: Instagram/Pranita Subhash

కరోనా లాక్‌డౌన్‌ సమయంలో ప్రణీత గొప్ప మనసును చాటుకుంది. ఆకలితో అలమటిస్తోన్న ఎంతోమందికి ఆహారం అందించింది. అనేక సామాజిక సేవల్లో చురుగ్గా పాల్గొంటోంది. 

Image: Instagram/Pranita Subhash

బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్‌ రాజును ప్రణీత 2021లో వివాహమాడింది. గతేడాది ఈమె పండంటి బిడ్డ(ఆర్నా)కు జన్మనిచ్చింది. 

Image: Instagram/Pranita Subhash

ప్రస్తుతం కన్నడలో ‘రమణ అవతార’తోపాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోంది.

Image: Instagram/Pranita Subhash

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home