యూట్యూబ్ చారుశీల.. ప్రవల్లిక దామెర్ల
వెండితెర హీరోయిన్లకే కాదు.. యూట్యూబ్ వెబ్‌సిరీస్‌ల్లో నటిస్తోన్న హీరోయిన్లకు కూడా అభిమానులు పెరుగుతున్నారు. అలాంటి క్రేజ్ ఉన్న హీరోయినే.. ప్రవల్లిక దామెర్ల.
(Photos: Instagram/pravallika damerla)
గత మూడేళ్లుగా యూట్యూబ్ వీక్షకుల్ని ఆకట్టుకుంటోన్న ఈ బ్యూటీ తాజాగా ‘7 డేస్ ఆఫ్ లవ్’ వెబ్‌సిరీస్‌లో నటించింది. ఇందులోని 7 ఎపిసోడ్లకూ లక్షల్లో వ్యూస్ వచ్చాయి.. వస్తున్నాయి.
ప్రవల్లిక.. మార్చి 19, 1997న భద్రాచలంలో జన్మించింది. హైదరాబాద్‌లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్‌లో బీ.టెక్ చేసింది.
డిగ్రీ చదువుతున్నప్పుడే డబ్‌స్మాష్, టిక్‌టాక్ వీడియోలు చేస్తూ సోషల్‌మీడియాలో పోస్ట్ చేసేది. అందాల పోటీల్లోనూ పాల్గొని పలు టైటిళ్లు గెలుచుకుంది.
ఈమె వీడియోలు చూసిన షణ్ముఖ్ జస్వంత్ ‘సాఫ్ట్‌వేర్ డెవలపర్’ దర్శకుడు సుబ్బు.. ఆ వెబ్‌సిరీస్ చివరి ఎపిసోడ్‌లో నటించే అవకాశమిచ్చాడు.
ఆ వెబ్‌సిరీస్‌లో నటించింది కాసేపే అయినా.. ప్రవల్లికకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ‘తొందర పడకు సుందర వదనా’ వెబ్‌సిరీస్‌లో హీరోయిన్‌గా నటించే ఛాన్స్ కొట్టేసింది.
ఆ తర్వాత గాయకుడు నోయెల్ రూపొందించిన ‘మారదే మారదే’ మ్యూజిక్ వీడియోలో మెరిసింది. ఆ వీడియోకి 4 మిలియన్‌కిపైగా వ్యూస్ వచ్చాయి.
This browser does not support the video element.
తన అందం, అభినయానికి అవకాశాలు క్యూ కట్టాయి. అలా.. వాళ్లిద్దరి మధ్యలో, బృందావనం అది అందరిది, పక్కింటి అబ్బాయి, చారుశీల తదితర వెబ్‌సిరీస్‌ల్లో నటించింది.
‘లాక్డ్’ అనే ఒక హారర్ షార్ట్‌ఫిల్మ్‌లోనూ ప్రవల్లిక నటించింది. ఈమె పేరుతో ఉన్న యూట్యూబ్ ఛానల్‌కి 1.95లక్షల మంది సబ్‌స్క్రయిబర్స్ ఉన్నారు.
ఇన్‌స్టాలోనూ ఈ యూట్యూబ్ బ్యూటీ చాలా యాక్టీవ్. గ్లామర్ ఫొటోలు పోస్ట్ చేస్తూ యూత్‌ను ఆకట్టుకుంటోంది. వెండితెరపై కనిపించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.