కొంటె చూపుల చిన్నది.. ప్రీతి అస్రాని

బాలనటిగా పలు సినిమాలు చేసి ఇప్పుడు హీరోయిన్‌గా మారింది యంగ్‌ బ్యూటీ ప్రీతి అస్రాని.

Image: Instagram/Preethi Asrani

తాజాగా ఈ చిన్నది శ్రీసింహా హీరోగా తెరకెక్కిన ‘దొంగలున్నారు జాగ్రత్త’లో నటించింది. సెప్టెంబర్‌ 23న ఈ చిత్రం విడుదల కానుంది.

Image: Instagram/Preethi Asrani

‘ఊకొడతారా.. ఉలిక్కి పడతారా’, ‘గుండెల్లో గోదారి’ సినిమాల్లో బాలనటిగా కనిపించింది. 

Image: Instagram/Preethi Asrani

సుమంత్‌ హీరోగా వచ్చిన ‘మళ్లీ రావా’ సినిమాలో యంగ్‌ హీరోయిన్‌గా నటించి మెప్పించింది. అదే ఏడాది ‘సోషల్‌’ అనే వెబ్‌సిరీస్‌లో నటించింది.

Image: Instagram/Preethi Asrani

గుజరాత్‌లో పుట్టిన ప్రీతి పదో తరగతి పూర్తయ్యాక నటనపై ఉన్న ఇష్టంతో హైదరాబాద్‌కు మకాం మార్చింది. గ్రాడ్యుయేషన్‌ చేస్తూనే నటిగా రాణిస్తోంది.

Image: Instagram/Preethi Asrani

టీనేజీలోనే ‘పక్కింటి అమ్మాయి’ అనే సీరియల్లో అవకాశం వచ్చింది. ‘ఫిదా’ అనే షార్ట్‌ ఫిలింలోనూ నటించింది.

Image: Instagram/Preethi Asrani

మోడలింగ్‌తో పాటుగా కొన్ని ప్రకటల్లోనూ మెరిసింది. ప్రీతి నటించిన ‘ప్రెజర్‌ కుక్కర్‌’ ఆశించిన విజయం అందుకోలేదు.

Image: Instagram/Preethi Asrani

గోపీచంద్‌ ‘సీటీమార్‌’ సినిమాలో కబడ్డీ టీమ్‌ కెప్టెన్‌ రోల్‌ చేసింది. ‘9 అవర్స్‌’ అనే వెబ్‌ సిరీస్‌లో నటించింది.

Image: Instagram/Preethi Asrani

ప్రస్తుతం సమంత ‘యశోద’తోపాటు.. మరో రెండు సినిమాల్లో నటిస్తోంది ప్రీతి.

Image: Instagram/Preethi Asrani

ప్రీతి సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌. తనకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

Image: Instagram/Preethi Asrani

ప్రీతి సోదరి అంజు అస్రాని సీరియల్‌ నటి, మోడల్‌. ఆమెనే తనకు స్ఫూర్తి అని.. ఏ సినిమా విషయంలో తనతో చర్చించాకే నిర్ణయం తీసుకుంటానని చెబుతోందీ ప్రీతి.

Image: Instagram/Preethi Asrani

పచ్చందనమే.. పచ్చదనమే

‘హిట్‌’ కొట్టేసిన మీనాక్షి చౌదరి!

పెళ్లి పీటలెక్కనున్న ‘అతియా శెట్టి’

Eenadu.net Home