విరాట్‌ కోహ్లీకి వీరాభిమానిని!

‘ధూత’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకున్న ప్రియా భవానీ శంకర్‌ ఇప్పుడు ‘భీమా’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. 

గోపీచంద్‌ హీరోగా హర్ష తెరకెక్కించిన ఈ చిత్రం మార్చి 8న విడుదల కానుంది.

సంతోష్‌ శోభన్‌ సరసన ‘కల్యాణం కమణీయం’తో తెలుగు తెరకు పరిచయమైంది ప్రియ.

చెన్నైలోనే పుట్టి అక్కడే బీటెక్‌, ఎంబీఎ పూర్తి చేసింది. కొద్ది రోజులు ఇన్ఫోసిస్‌లో ఉద్యోగం కూడా చేసింది. 

నటనపై ఆసక్తితో తమిళ ఛానల్‌లో యాంకర్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత సీరియల్స్‌లోనూ కనిపించింది.

‘‘సినీ నేపథ్యం ఉన్న వారే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి కష్టపడుతున్నారు. అలాంటిది బ్యాక్‌గ్రౌండ్‌ లేకుండా ఎంట్రీ ఇచ్చిన నేను భవిష్యత్తు కోసం చాలా శ్రమించాలి’’ అని లైఫ్‌ మీద ఫుల్‌ క్లారిటీతో మాట్లాడుతుంటుంది.

‘‘పరిశ్రమకు వచ్చిన కొత్తలో నన్ను గైడ్‌ చేసే వారెవరూ లేరు. ఎలాంటి కథలను ఎంచుకోవాలో తెలియక కొన్ని మంచి సినిమాలకు నో చెప్పాను. ఆ తర్వాత బాధపడ్డాను. నేను చేసిన తప్పుల నుంచే భవిష్యత్తులో ఎలా ఉండాలో నేర్చుకున్నాను’’ అని అంది.

ప్రియా భవానీ శంకర్‌కు బిర్యానీ, ఐస్‌క్రీమ్‌ అంటే ఇష్టమట. నలుపు రంగు ఫేవరెట్‌.

This browser does not support the video element.

ఒకానొక పరిస్థితిలో మన చుట్టూ ఎవరూ ఉండకపోవచ్చు. అప్పుడు మన కోసం మనమే నిలబడాలి. ధైర్యంగా ఉండటం నేర్చుకోవాలి అంటూ యువతకు తనదైన శైలిలో జీవితం గురించి చెబుతోంది.

టీమ్‌ ఇండియా కింగ్‌ విరాట్‌ కోహ్లీకి విరాభిమాని. విరాట్‌ ఆడుతున్నాడంటే మ్యాచ్‌ వదిలే ప్రసక్తే లేదు. 

ప్రస్తుతం ప్రియ ‘జీబ్రా’, ‘డిమాంటో కాలనీ 2’, ‘రత్నం’, ‘భారతీయుడు 2’ తదితర చిత్రాల్లో నటిస్తోంది.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home