కన్ను గీటింది.. ‘పెన్ను’ పాట పాడింది..
అలా కన్నుగీటి యువ హృదయాలను కొల్లగొట్టిన మలయాళీ భామ ప్రియా ప్రకాశ్ వారియర్. తాజాగా ‘పెన్ను’ పేరుతో 1 మినిట్ మ్యూజిక్‌ను విడుదల చేసింది.
Image: Instagram/Priya Prakash Varrier
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రస్తుతం ‘1 మినిట్ మ్యూజిక్’ ట్రెండ్ నడుస్తోంది. పలువురు సింగర్స్ ఒక్క నిమిషంలో సొంతగా ఒక పాటను కంపోజ్ చేసి పోస్టు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియ కూడా వీడియోను రూపొందించింది.
Image: Instagram/Priya Prakash Varrier
ఇప్పటికే నటనతోపాటు గాత్రంతోనూ మెప్పించిందీ.. మాలీవుడ్ అందం. మలయాళం, తెలుగు, హిందీ మ్యూజిక్ ఆల్బమ్స్‌లో పాటలు పాడింది.
Image: Instagram/Priya Prakash Varrier
ప్రియా ప్రకాశ్ వారియర్ కేరళలోని త్రిస్సూర్‌లో 1999 అక్టోబర్ 28న జన్మించింది. బ్యాచ్‌లర్ ఆఫ్ కామర్స్‌లో డిగ్రీ చేసింది.
Image: Instagram/Priya Prakash Varrier
2019లో వచ్చిన ‘ఒరు అడార్ లవ్’(తెలుగులో లవర్స్ డే) చిత్రంతో మంచి గుర్తింపును తెచ్చుకుంది.
Image: Instagram/Priya Prakash Varrier
ఈ చిత్రంలోని ఓ సన్నివేశంలో ప్రియ కొంటెగా కన్నుగీటే వీడియో సోషల్‌మీడియాలో బాగా ట్రెండ్ అయింది. దీంతో ఆమె జీవితమే మారిపోయింది.
Image: Instagram/Priya Prakash Varrier
అంతకుముందు ‘తన్హా’ అనే చిత్రంలో అతిథిపాత్రలో కనిపించింది ప్రియ.
Image: Instagram/Priya Prakash Varrier
‘ఒరు అడార్ లవ్’తో వచ్చిన ఫేమ్‌తో ఆమెకు వివిధ చిత్రసీమల నుంచి అవకాశాలు క్యూ కట్టాయి.
Image: Instagram/Priya Prakash Varrier
అలా తెలుగులో నితిన్ హీరోగా వచ్చిన ‘చెక్’లో నటించింది. ఆ తర్వాత తేజ సజ్జా ‘ఇష్క్: నాట్ ఏ లవ్‌స్టోరీ’లోనూ మెరిసింది.
Image: Instagram/Priya Prakash Varrier
కరోనా లాక్‌డౌన్ సమయంలో ఈ యంగ్ బ్యూటీ.. సోషల్‌మీడియా నుంచి వైదొలగి అందరినీ ఆశ్చర్యపర్చింది. రెండు వారాల తర్వాత మళ్లీ నెటిజన్లను పలకరించింది.
Image: Instagram/Priya Prakash Varrier
అప్పుడప్పుడు విభిన్నమైన ఫొటోషూట్స్‌లో పాల్గొంటూ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేస్తుంటుంది. ఇన్‌స్టాలో ఆమెకు 7.2 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/Priya Prakash Varrier
ఈ కేరళ కుట్టికి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అంటే ఎంతో అభిమానమట. చిన్నప్పుడు హృతిక్ రోషన్‌ను చాలా ఇష్టపడేదట.
Image: Instagram/Priya Prakash Varrier
ప్రస్తుతం ప్రియ చేతిలో అరడజనకుపైగా ప్రాజెక్టులున్నాయి. ‘శ్రీదేవీ బంగ్లా’తో త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
Image: Instagram/Priya Prakash Varrier