గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక.. హాలీవుడ్ వయా బాలీవుడ్

ఈ గ్లోబల్ స్టార్‌ పుట్టిన రోజు వేళ ఆమె గురించి ఆసక్తికర విశేషాలు.

Source: Instagram/Priyanka Chopra

ప్రియాంక చోప్రా ఝార్ఖండ్‌లోని జంషెడ్‌పూర్‌(అప్పుడు బిహార్‌)లో 1982, జులై 18న జన్మించింది.

Source: Instagram/Priyanka Chopra

ఈమె తల్లిదండ్రులు అశోక్‌ చోప్రా, మధు అఖౌరి ఇద్దరూ వైద్యులే. ప్రియాంకకు తమ్ముడు సిద్ధార్థ్‌ ఉన్నాడు.

Source: Instagram

2000లో ప్రపంచ సుందరిగా నిలిచిన ప్రియాంక.. 2002లో తమిళ హీరో విజయ్ సరసన ‘తమిళన్’తో తెరంగేట్రం చేసింది. 2003లో ‘ది హీరో.. లవ్‌ స్టోరీ ఆఫ్‌ ఏ స్పై’తో బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

Source: Instagram/Priyanka Chopra

2015లో ‘క్వాంటికో’ చిత్రంతో హాలీవుడ్‌ తెరపై మెరిసిన పీసీ.. అక్కడ వరుస అవకాశాలు దక్కించుకుంది.

Source: Instagram/Priyanka Chopra

‘పర్పుల్‌ పెబెల్‌ పిక్చర్స్‌’ పేరుతో ఆమెకో సొంత నిర్మాణ సంస్థ ఉంది. ‘అనోమలీ’పేరుతో కేశ సౌందర్య ఉత్పత్తుల బ్రాండ్‌ నడిపిస్తోంది.

Source: Instagram/Priyanka Chopra

కుర్ర జంటల్ని ఆకట్టుకోవడంలో ముందున్న ‘బంబుల్‌’ అనే డేటింగ్‌ యాప్‌లోనూ పెట్టుబడులు పెట్టింది. ‘సోనా’ బ్రాండ్‌తో న్యూయార్క్‌లో రెస్టారెంట్లనూ నడిపిస్తోంది.

Source: Instagram/Priyanka Chopra

2016లో కేంద్ర ప్రభుత్వం ఈమెను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. ఫోర్బ్స్‌.. 100 మోస్ట్‌ పవర్‌ఫుల్‌ ఉమెన్‌ లిస్ట్‌లో, ప్రపంచంలో 100 మంది అత్యంత ప్రభావిత వ్యక్తుల్లో ఒకరిగా టైమ్స్‌ మ్యాగజైన్‌లో చోటు దక్కించుకుంది.

Source: Instagram/Priyanka Chopra

అమెరికా పాప్‌ సింగర్‌ నిక్‌ జోనస్‌ను 2018 డిసెంబర్‌లో వివాహమాడింది. మంగళసూత్రం మెడలో పడిన క్షణాన్ని తానేప్పటికీ మర్చిపోలేనని ప్రియాంక ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది.

Source: Instagram/Priyanka Chopra

2022 జనవరిలో ఈ గ్లోబల్‌ స్టార్‌ దంపతులు సరోగసి ద్వారా తల్లిదండ్రులయ్యారు. వారి కుమార్తె పేరు మాల్టీ మేరీ చోప్రా జోనస్‌.

Source: Instagram/Priyanka Chopra

కొన్ని రోజుల కిందట సోషల్‌ మీడియా ఖాతాల్లో తన భర్త నిక్‌ పేరును తొలగించింది. అప్పుడు విడాకులు తీసుకుంటున్నారని వార్తలొచ్చాయి. కానీ.. వాటిని ఆమె ఖండించింది.

Source: Instagram/Priyanka Chopra

బాలీవుడ్‌లో ఆమె అడుగుపెట్టి రెండు దశాబ్దాలు కావొస్తున్నాయి. ‘‘ఈ రోజు నేను ఇలా ఉన్నానంటే కారణం నా నిర్ణయాలే’’అని ప్రియాంక గర్వంగా చెబుతోంది.

Source: Instagram/Priyanka Chopra

ప్రస్తుతం ప్రియాంక.. ఇట్స్‌ ఆల్‌ కమింగ్‌ టు మీ(హాలీవుడ్‌) జీ లే జరా, షీలా, కల్పనా చావ్లా బయోపిక్‌, మ్యాట్రిక్స్‌ 4, సితాడెల్‌(టీవీ సిరీస్‌) ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Source: Instagram/Priyanka Chopra

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home