రాజమౌళి చిత్రంలో గ్లోబల్ స్టార్ ప్రియాంక
#Priyanka
2000 సంవత్సరంలో మిస్ ఇండియా, మిస్ వరల్డ్ పోటీల్లో విజేత
అమెరికన్ టెలివిజన్ షో (క్వాంటికో)లో నటించిన తొలి బాలీవుడ్ నటి
ప్రియాంకచోప్రా పేరు, రూపంతో ఇంగ్లాండ్‌కు చెందిన కంపెనీ ఫ్యాషన్ బొమ్మలను తయారు చేసింది. ఇప్పుడవి అరుదైన బొమ్మల జాబితాలో చేరాయి.
2018లో నటుడు, సంగీతకారుడైన నిక్ జోనస్ ఆమె పుట్టినరోజుకు ప్రపోజ్ చేయగా, అదే ఏడాది వివాహ బంధంతో ఒక్కటయ్యారు.
లఖ్‌నవూలో ప్రాథమిక విద్యను అభ్యసించిన ప్రియాంక బోస్టన్‌లో చదువుకున్నారు. నటి కాకపోతే క్రిమినల్ సైకాలజిస్ట్ అయ్యేవారట.
‘తమిళన్’ (తమిళ చిత్రం)తో తెరంగేట్రం చేశారు ప్రియాంక. అందులో పాట కూడా పాడారు.
2016లో పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. అదే ఏడాది పీపుల్స్ ఛాయిస్ అవార్డు సొంతం. ఈ పురస్కారం అందుకున్న తొలి దక్షిణాసియా నటి ప్రియాంక.
‘అన్‌ఫినిష్డ్’ పేరుతో ఆటోబయోగ్రఫీని అందుబాటులోకి తీసుకువచ్చిన నటి.
చీర, జీన్స్ టీ షర్ట్స్ అంటే ఇష్టం. సౌకర్యవంతమైన దుస్తులకే ప్రియాంక మొదటి ప్రాధాన్యత.
జంతు ప్రేమికురాలు. రాంచీలోని బయోలాజికల్ పార్క్‌లో ఓ సింహం, పులిని దత్తత తీసుకున్నారు.