ఇళయరాజా మ్యూజిక్‌.. కప్పు కాఫీ.. అదో మ్యాజిక్‌

‘సరిపోదా శనివారం’తో వచ్చి మంచి విజయం అందుకుంది ప్రియాంక మోహన్‌. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ భామ గురించి కొన్ని విషయాలు..

 నాని హీరోగా నటించిన ‘సరిపోదా శనివారం’లో చారులతగా మంచి మార్కులే కొట్టేసింది ప్రియాంక.

‘నిల్వకు ఎన్‌ మెల్‌ ఎన్నడి కోబమ్‌’ అనే తమిళ సినిమాలో ‘బంగారు పిచ్చుక..’ అనే ప్రత్యేక పాటలో ఆడిపాడనుంది.

షూటింగుల్లో ఎంత బిజీగా ఉందో.. సోషల్‌ మీడియాలోనూ అంతే సందడి చేస్తుంటుంది. సెట్‌లో చేసే అల్లరి వీడియోలు, ఫొటోలను షేర్‌ చేస్తుంటుంది.

ఇన్‌స్టాలో ఈమె ఫాలోవర్లు ఈ మధ్య కాలంలో భారీగా పెరిగారు. ప్రస్తుతం ఈ బ్యూటీ ఇన్‌స్టా ఖాతాని 59లక్షల మంది ఫాలో అవుతున్నారు.

ప్రియాంకకు చీరలు ధరించడం అంటే ఇష్టం. లైట్‌ వెయిట్‌, నెట్టెడ్‌ శారీస్‌తో ట్రెడిషనల్‌ లుక్‌లో ఫొటోషూట్లు చేస్తుంటుంది.

‘ఇళయారాజా సంగీతం, చేతిలో కప్పు ఫిల్టర్‌ కాఫీ.. రోజంతా యాక్టివ్‌గా ఉండేందుకు ఇవి చాలు’ అని చెబుతోంది.

ఈమె మేకప్‌ తక్కువగా వాడుతుంది. అందుకే బయటకు వెళ్లాల్సి వస్తే ఠక్కున్న రెడీ అవుతుంది.

తరచూ ట్రిప్పులకి వెళ్లే ఈ బ్యూటీకి.. నీళ్లల్లో ఆడుకోవడం అంటే మహా ఇష్టం. ఏ ట్రిప్‌ అయినా నీళ్లలో ఆడుకోవడం కామన్‌.

ప్రియాంక తమిళంలో చేసిన ‘బ్రదర్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. తెలుగులో పవన్‌ కల్యాణ్‌ ‘ఓజీ’లో నటిస్తోంది.

నిమ్రత్‌ @ 8.. రూమర్స్‌తో ట్రెండింగ్‌లోకి!

ఇండియాలో టాప్‌- 10 ‘గూగుల్డ్‌’ షోస్‌

సెలెనా గోమెజ్‌... పెళ్లి వార్తతో వైరల్‌

Eenadu.net Home