ఇదీ.. శ్రీమ కొట్టిన జాక్‌పాట్!
మణిరత్నం తెరకెక్కించిన ‘పొన్నియిన్ సెల్వన్ 1 & 2’. బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇందులో పెద్దపెద్ద స్టార్స్‌తోపాటు.. మరో నటి కూడా ఆకట్టుకుంటోంది. తనే శ్రీమ ఉపాధ్యాయ.
Image: Instagram/Shreema Upadhyaya
ఈ చిత్రంలో శ్రీమ.. రాష్ట్రకూట యువరాణి ‘మాథులి’ పాత్ర పోషించింది. కనిపించేది కొద్దిసేపే అయినా.. తన అందంతో ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.
Image: Instagram/Shreema Upadhyaya
ఈమెకు ఇదే తొలిచిత్రం. మణిరత్నంలాంటి దిగ్గజ దర్శకుడి సినిమాతో తెరంగేట్రం చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
Image: Instagram/Shreema Upadhyaya
శ్రీమ పుట్టిపెరిగింది కర్ణాటకలోని బెంగళూరులో. ఈమె ప్రొఫెషనల్ క్లాసికల్ డ్యాన్సర్. నాలుగేళ్ల వయసు నుంచే భరతనాట్యం నేర్చుకోవడం మొదలుపెట్టింది.
Image: Instagram/Shreema Upadhyaya
తన జీవితంలో భరతనాట్యానికే తొలి ప్రాధాన్యత ఇస్తుందట. దేశవిదేశాల్లో అనేక చోట్ల నాట్య ప్రదర్శన ఇచ్చింది.
Image: Instagram/Shreema Upadhyaya
ముఖంలో శ్రీమ పలికించే భావాలు ‘పీఎస్’ చిత్రబృందానికి నచ్చి ఆడిషన్స్‌కి పిలిచారట. మొదట మరో పాత్ర కోసం ఆడిషన్ చేసి చివరికి ‘మాథులి’ పాత్ర ఇచ్చారట.
Image: Instagram/Shreema Upadhyaya
ఐశ్వర్యరాయ్, త్రిష వంటి సీనియర్ తారలను చూస్తూ పెరిగిన తనకి.. వారి చిత్రంలో నటించే అవకాశం రావడం ఇప్పటికీ నమ్మలేకపోతున్నానంటోంది.
Image: Instagram/Shreema Upadhyaya
శ్రీమ నటనను మెచ్చి మరో తమిళ చిత్రంలో అవకాశమొచ్చింది. నటిస్తూనే తన డ్యాన్స్ కెరీర్‌ను కొనసాగిస్తానని చెబుతోంది.
Image: Instagram/Shreema Upadhyaya
ఈ కన్నడ భామ ఫిట్‌నెస్ ఫ్రీక్. ప్రతి రోజు యోగాతో రోజును ప్రారంభిస్తుందట. ఖాళీ సమయం దొరికితే పెయింటింగ్ వేస్తుందట.
Image: Instagram/Shreema Upadhyaya