మరోసారి మెరిసిన పీవీ సింధు 

తెలుగు తేజం, ఒలింపిక్స్‌ పతకాల విజేత పీవీ సింధు మరోసారి సత్తా చాటింది. 

Source: Twitter

సింగపూర్‌ ఓపెన్‌ ఫైనల్‌లో చైనా క్రీడాకారిణి వాంగ్‌ జి యిని మట్టికరిపించి తన కెరీర్‌లోనే తొలి సూపర్ 500 టైటిల్‌ను నెగ్గింది.

Source: Twitter

ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన సింధు 21-9, 11-21, 21-15 తేడాతో వాంగ్‌పై విజయం సాధించింది. దీంతో తొలిసారి సింగపూర్‌ ఓపెన్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది.

Source: Twitter

ప్రస్తుత సీజన్‌లో సింధుకిది మూడో టైటిల్‌. ఇదే ఏడాది సయ్యద్‌ మోదీ ఇంటర్నేషనల్‌, స్విస్ ఓపెన్‌ బీడబ్ల్యూఎఫ్‌ సూపర్‌ 300 టైటిళ్లను గెలుచుకుంది.

Source: Twitter

చిన్నప్పటి నుంచి బ్యాడ్మింటన్‌ను తన జీవితంగా.. ఎప్పుడూ ప్రాక్టీస్, గేమ్స్, టూర్స్‌ అంటూ బిజీగా ఉండే సింధు జీవితంలో కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి.

Source: Twitter

ఈ స్టార్‌ షట్లర్‌ సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌. 

Source: Twitter

విదేశాల్లో టోర్నీలు ఆడటానికి వెళ్లినప్పుడు అక్కడ వివిధ ప్రదేశాల్లో దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.

Source: Twitter

భారత్‌లో ఉన్నప్పుడు కూడా సింధు ఎక్కువ సమయం ఇంట్లో ఉండదు. ఏ మాత్రం తీరిక సమయం దొరికిన కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి పర్యాటక ప్రాంతాలకు వెళ్తుంది.

Source: Twitter

బ్యాడ్మింటన్‌ గేమ్‌లో చాలా ఒత్తిడి ఉంటుంది. ఈ గేమ్‌ ఆడే ప్లేయర్లకి ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ ఉన్నా మెంటల్ ఫిట్‌నెస్‌ కూడా అవసరం. అందుకే స్విమ్మింగ్, మెడిటేషన్‌కు సింధు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఉంటుంది.

Source: Twitter

సింధు మంచి భోజన ప్రియురాలు. గేమ్‌ నుంచి విరామం తీసుకున్నప్పుడు తన ఫ్రెండ్స్, వేరే ప్లేయర్లు, కుటుంబ సభ్యులతో కలసి మంచి ఫుడ్ లాగిస్తుంది.

Source: Twitter

2016లో రియో ఒలింపిక్స్‌లో సింధు రజత పతకం నెగ్గింది. ఆ ఒలింపిక్స్‌కు సన్నద్ధతమవుతున్న సమయంలో ఆట మీద మరింత ఫోకస్‌ పెట్టాలనే ఉద్దేశంతో మూడు నెలలపాటు సెల్‌ఫోన్‌కు దూరంగా ఉంది.

Source: Twitter

గతేడాది జరిగిన టోక్యో ఒలింపిక్స్‌లో సింధు కాంస్య పతకం అందుకున్న విషయం తెలిసిందే.

Source: Twitter

ఫుట్‌బాల్‌.. మీకివి తెలుసా!

దేశవాళీ.. లిస్ట్‌-ఏ.. టాప్‌ 10 బ్యాటర్లు!

టీ20ల్లో హ్యాట్రిక్‌ వికెట్ విశేషాలు!

Eenadu.net Home