దిల్లీ వదిలి నన్ను ముంబయికి రమ్మంది..!

టాలీవుడ్‌ ‘బెల్లం శ్రీదేవి’.. అదేనండీ! మన రాశీ ఖన్నా. సిద్ధూ జొన్నలగడ్డతో ‘తెలుసు కదా’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

లవ్‌, ఎమోషన్స్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రాశితో పాటు మరో నాయిక శ్రీనిధి శెట్టి నటిస్తోంది. నటీనటుల్ని పరిచయం చేస్తూ చిత్రబృందం ఓ వీడియోని రిలీజ్‌ చేసింది.

నాగచైతన్య సరసన ‘థ్యాంక్యూ’ తర్వాత రాశీఖన్నా నటిస్తున్న చిత్రమే ‘తెలుసు కదా’. 

‘ఊహలు గుసగుసలాడే’ నుంచి ‘సర్దార్‌’ వరకూ తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో తన నటన, అందంతో రాశీఖన్నా ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది.

బాలీవుడ్‌లో సిద్ధార్థ మల్హోత్రా సరసన ‘యోధ’లో నటిస్తోంది. తమిళంలో ‘మేధావి’, ద్విభాషా చిత్రం ‘అరణ్మనై’లోనూ రాశీయే నాయిక.

సినిమాలే కాదు, ‘రుద్ర’, ‘ఫర్జీ’ వంటి వెబ్‌సిరీస్‌ల్లోనూ నటించి ఓటీటీలోనూ తనదైన ముద్రవేసింది.

రాశీఖన్నా.. దుస్తుల్ని ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకుంటుంది. తన ట్రెండింగ్‌ దుస్తుల ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది. నెట్టింట ఎప్పుడూ రాశీఖన్నా గ్లామర్‌ సీక్రెట్‌ హాట్‌టాపికే.

‘చదువులో నేను టాప్‌ర్‌. మాస్టర్స్‌ చేసి ఉద్యోగం సంపాదించాలన్నది లక్ష్యం. నా బెస్టీ వాణీ కపూర్‌.. నన్ను దిల్లీ వదిలి వేసవి సెలవుల్లో యాక్టింగ్‌ ప్రయత్నించేందుకు ముంబయి రమ్మంది.’

‘నీ వల్ల కాకపోతే మళ్లీ తిరిగి వెళ్లిపో’అంది. నాకేమో చదువుకోవాలనుంది. వాణీకేమో నన్ను యాక్టర్‌గా చూడాలని కోరిక. అలా ప్రయత్నిద్దామని నటనలోకి అడుగుపెట్టి ఇలాగే స్థిరపడిపోయాను’ అంటుంది రాశి.

ఖాళీ సమయంలో రాశీఖన్నా పద్యాలు, పుస్తకాలు చదువుతుంది. పాటలూ పాడుతుంది. తెలుగులో ‘జోరు’లో టైటిల్‌ సాంగ్‌తో పాటు పలు చిత్రాల్లో పాటలు పాడి అలరించింది.

This browser does not support the video element.

‘చైనీస్‌ వంటకాలు నా ఫెవరేట్‌. మహేష్‌ బాబు, షారుక్‌ ఖాన్‌, రణ్‌బీర్‌కి వీరాభిమానిని. హైదరాబాద్‌లోని ఎన్‌గ్రిల్‌ రెస్టారెంట్‌ బాగా నచ్చుతుంది’ అంటోందీ అందాల‘రాశి’.  

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home