జర్నలిస్ట్‌ ‘రాశీ సింగ్‌’

 ‘ప్రేమ్‌ కుమార్‌’తో సంతోష్‌ శోభన్‌ సరసన నటించి తెలుగు తెరకు పరిచయమైంది రాశీ సింగ్‌. ఇప్పుడు ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.  

శివ కందుకూరి హీరోగా పురుషోత్తం రాజ్‌ తెరకెక్కించిన ఈ సినిమా మార్చి 1న విడుదల కానుంది.

‘భూతద్దం..’లో రాశీ పాత్రికేయురాలిగా కనిపించనుంది. ఈ పాత్రతో మెప్పిస్తానని నమ్మకంగా చెబుతోంది.

రాయ్‌పుర్‌లో జన్మించిన రాశీ దిల్లీ విశ్వవిద్యాలయంలో చదువు పూర్తి చేసింది. 

రాశీ సింగ్‌ కుటుంబం ఇంతకు ముందు ముంబయిలో ఉండేదట. తెలుగు చిత్ర పరిశ్రమలో నటించాలనే ఇష్టంతో హైదరాబాద్‌కి వచ్చేశారు.

‘శశి’, ‘జెమ్‌’, ‘ప్రేమ్‌ కుమార్‌’ సినిమాల్లో నటించింది. ‘పాపం పసివాడు’ వెబ్‌సిరీస్‌తోనూ ఆకట్టుకుంది. 

‘భూతద్ధం..’ నా కోసమే ఎదురు చూసిన సినిమా. చాలా కాలంగా చిత్ర బృందం ఓ కొత్త అమ్మాయి కోసం అన్వేషిస్తోంది. ఫైనల్‌గా ఆ సినిమాకి నన్ను ఎంపిక చేశారు’ అని చెప్పింది.

సుహాస్‌తో కలసి ‘ప్రసన్నవదనం’లో నటించింది. అందులోనూ తన పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది.

This browser does not support the video element.

స్నేహితులతో కలిసి సరదాగా విహార యాత్రలు ప్లాన్‌ చేస్తుంది. వారితో కలిసి చేసిన రీల్స్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తుంటుంది.

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home