ఫోర్బ్స్ 30 రాధిక
ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన 30 అండర్ 30 జాబితాలో ఇద్దరు కథానాయికలకు చోటు దక్కింది. వారిలో ఒకరు.. రష్మిక మందన్న కాగా.. మరొకరు రాధికా మదన్.
ఈమె 2014లో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది.‘మేరీ ఆషికి తుమ్ సే హై’, ‘సింతా ది పంగ్‌కు ఆన్ హిమాలయ’, ‘సాస్’, ‘బహు ఔర్ ఫ్లెమింగో’తదితర సీరియల్స్‌తో అభిమానుల్ని సంపాదించుకుంది.
‘పటాఖా’తో 2018లో వెండితెరపై మెరిసింది. ‘మర్ద్ కో దర్ద్ నహీ హోతా’, ‘అంగ్రేజీ మీడియం’, ‘షిద్దాత్’, ‘మోనికా.. ఓ మై డార్లింగ్’, ‘కుట్టీ’, ‘కచ్చే లింబు’, ‘సజ్నీ షిండే కా వైరల్ వీడియో’ చిత్రాల్లో నటించింది.
ఈ బ్యూటీ దిల్లీ(1995)లో జన్మించింది. తండ్రి బిజినెస్‌మ్యాన్, తల్లి పెయింటర్. డ్యాన్స్ మీద ఉన్న ఆసక్తితో 8వ తరగతిలో ఉన్నప్పుడే శిక్షణ తీసుకుంది. 2006లో మొదటిసారి ‘ఝలక్ దిఖ్లాజా’ డ్యాన్స్ షోలో పాల్గొంది.
దిల్లీలోని జేఎంసీ కాలేజ్‌లో బి.కామ్ పూర్తి చేసిన రాధిక.. కొన్నాళ్లు అసిస్టెంట్ డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటిగా అవకాశాలొచ్చాయి.
చిన్నప్పుడు టామ్ బాయ్‌లా ఉండేందుకు ఇష్టపడేదట. అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేందుకే ఎక్కువ సమయం కేటాయించేది.
‘నటి అవ్వాలనే ఆలోచనే లేదు. డ్యాన్సింగ్ స్టార్ అవ్వాలనుకున్నాను. న్యూయార్క్‌లోని ఓ డ్యాన్స్ కాలేజీలో సీటు కూడా వచ్చింది. అక్కడికి వెళ్లడానికి పదిహేను రోజుల ముందు ‘మేరీ ఆషికి తుమ్ సే హై’ టీమ్ నన్ను సంప్రదించింది. అలా నటినయ్యాను.’ అని చెబుతుంది రాధిక.
షూటింగ్ కోసం ముంబయి వెళ్లడం, ఆ తర్వాత వరుసగా అవకాశాలు రావడంతో నటిగా కొనసాగుతోందట. దీంతో డ్యాన్స్‌పై దృష్టి పెట్టలేకపోయానని చెబుతోంది.
నటీనటులకు మేకప్ తప్పనిసరి. కానీ, రాధికకు మేకప్ వేసుకోవడం అంటే అంటే అస్సలు ఇష్టమే ఉండదు. కాటుక మాత్రమే పెట్టుకునేందుకు ఆసక్తి చూపిస్తుంది.
ఎ.ఆర్. రెహమాన్ సంగీతం వినడానికి ఇష్టపడుతుంది. నటనలో కరీనా కపూర్, ప్రియాంకా చోప్రాకి తను వీరాభిమాని.