బ్యూటిఫుల్‌ బేగం.. అనుశ్రియా త్రిపాఠి

తెలంగాణ విముక్తి పోరాటం నేప‌థ్యంలో తెరకెక్కిన చిత్రం.. ‘ర‌జాకార్‌’. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలో అనుశ్రియా త్రిపాఠికి మంచి గుర్తింపు లభించింది.

నిజాం భార్య అజ్మా ఉన్నీసా పాత్రలో నటించి ప్రేక్షకుల్ని ఆకర్షించింది. దీంతో ఈ భామ కోసం యువత గూగుల్‌లో తెగ వెతికేస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో 1999లో పుట్టిన ఈ భామ బెంగళూరులో డిగ్రీ పూర్తి చేసింది. చదువుకునే సమయంలోనే నటనపై ఆసక్తి కలిగిందట.  

‘చదువు పూర్తయ్యాక నాన్న సివిల్స్‌కి ప్రిపేర్‌ అవ్వమన్నారు. దాంతో మూడేళ్లు చదువుకున్నాను. కానీ నా దృష్టంతా యాక్టింగ్‌పైనే ఉండేది’ అని చెబుతోంది అను.

ఈమె తల్లి మోడలింగ్‌ చేసేవారు. అలా తనకి కూడా మోడలింగ్‌పై కూడా ఇష్టం ఏర్పడింది. 2018లో చత్తీస్‌ఘడ్‌ తరఫున మిస్‌ ఇండియా పోటీల్లో పాల్గొంది. 

ఆ తర్వాత మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. పలు బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించి.. చిత్ర రంగంలో అడుగుపెట్టింది.

This browser does not support the video element.

‘రజాకార్‌ చిత్రానికి ఆడిషన్స్‌ జరుగుతున్నప్పుడు నేను దర్శకుడిని సంప్రదించాను. స్క్రీన్‌ టెస్ట్‌ చేసి బేగం పాత్రకు సరిపోతానని ఎంపిక చేశారు’ అని చెప్పిందీ బ్యూటీ.

ఈ సినిమా తనకో మంచి అవకాశమని, సీనియర్‌ నటులతో కలిసి పనిచేయడం వల్ల ఎన్నో విషయాలు, యాక్టింగ్‌ నైపుణ్యాలు నేర్చుకున్నానని తెలిపింది. 

ఈ భామ రణ్‌బీర్‌ కపూర్‌, రామ్‌చరణ్‌కి వీరాభిమాని. హీరోయిన్స్‌లో అనుష్క శెట్టి, కీర్తి సురేష్‌ అంటే ఇష్టం. ‘మహానటి’లో కీర్తి నటనకు ఫిదా అయిపోయానంటోంది.

 ‘మంచి కథయితే అందులో ఎలాంటి పాత్ర అయినా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మన ఫేవరెట్‌ నటీనటులతో కలిసి పనిచేస్తే ఆ ఆనందం ఇంకా రెట్టింపు అవుతుంది’అని ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.

ఈ బ్యూటీకి నగలు, చీరలతో ఫొటోషూట్లంటే మహా ఇష్టం. ఆ ఫొటోలను ఇన్‌స్టాలోనూ ఎక్కువగా షేర్‌ చేస్తుంటుంది. గ్లామర్‌ ఫొటోలతోనూ ఆకట్టుకుంటోంది. 

శ్రద్ధా దాస్‌... రొయ్యల కూర.. భలే కాంబో

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

Eenadu.net Home