రయ్‌రయ్‌.. రాశీ ఖన్నా 

గతేడాది సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన రాశీ ఖన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఇటీవల ‘యోధ’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది.

సిద్ధార్థ్‌ మల్హోత్రాకు జంటగా నటించి ‘యోధ’తో హిట్‌ను ఖాతాలో వేసుకుంది రాశీ. దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్‌లోనూ తన సత్తా చాటుతోంది. ఇప్పటికే ‘ఫర్జీ’ వెబ్‌సిరీస్‌తో ఆకట్టుకుంది.

త్వరలో మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తోంది. బాలీవుడ్‌ హీరో విక్రాంత్‌ మస్సేతో కలిసి నటించిన చిత్రం ‘ది సబర్మతి రిపోర్ట్’. రంజన్‌ చందేల్‌ దర్శకుడు. మే 3న విడుదలకు సిద్దమవుతోంది.  

This browser does not support the video element.

ఫిట్‌నెస్‌ కోసం జిమ్‌లో వ్యాయామాలు చేస్తుంటుంది. ‘కొందరు వ్యాయామం చేయడానికి మరీ ఎక్కువ కష్టపడిపోతుంటారు. దాన్ని నేను ఇష్టంగా ఎంజాయ్‌ చేస్తూ ఆస్వాదిస్తాను.’ అంటోంది రాశి. 

బాలీవుడ్‌ చిత్రం ‘మద్రాస్‌ కేఫ్‌’తో 2013లో తెరంగేట్రం చేసిన ఈ భామ.. ఆ తర్వాత వరసగా తెలుగు సినిమాలతో అలరించింది. ఇన్నేళ్ల తర్వాత హిందీలో మెరిసింది ‘యోధ’తోనే..

‘‘సుప్రీం’కి సీక్వెల్‌ వస్తే బాగుంటుంది. అందులో నా పాత్ర భిన్నంగా ఉంటుంది. బెల్లం శ్రీదేవి రోల్‌ నాకు ఎంతో నచ్చింది’ అంటోంది రాశి. 

This browser does not support the video element.

‘పిజ్జా అంటే చాలా ఇష్టం. షూటింగ్‌లో ఉన్నప్పుడు, వారం మొత్తం ఎలా ఉన్నా వీకెండ్స్‌ మాత్రం నచ్చిన ఆహారంతో ఎంజాయ్ చేస్తాను. హార్ట్‌ఫుల్‌గా నచ్చినవన్నీ తిన్నప్పుడే ప్రశాంతంగా పని చేయగలం’ అంటోంది.

జంతు వధను వ్యతిరేకిస్తుంది. ‘‘అనేక వ్యాధులను నయం చేసేందుకు గోవులు ఎంతగానో తోడ్పడతాయి. వాటిని కాపాడుకోవడం మన బాధ్యత’’ అంటూ అవగాహనా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంటుంది.

‘ఆరణ్మై’, ‘టీఎమ్‌ఈ’, ‘మేధావి’, ‘తెలుసు కదా’ తదితర చిత్రాలతో బిజీగా ఉంది.

This browser does not support the video element.

రాశీకి తన అన్న కుమారుడు అంటే ఎంతో ఇష్టం. తనతో కలసి చేసిన అల్లరి వీడియోలను ఇన్‌స్టాలో షేర్‌ చేసుకుంటుంది. తన ఇన్‌స్టా ఖాతాకి ఫాలోవర్లు కోటి మందికి పైమాటే..

అల్లు అర్జున్‌ ఫిట్‌నెస్‌ సీక్రెట్స్‌

ఆ సినిమాలు బోర్‌ కొట్టవు!

మలయాళీ బ్యూటీస్‌.. తెరపై క్యూట్‌నెస్‌

Eenadu.net Home