రాశీ సింగ్‌.. బ్యూటీ క్వీన్‌!

కొంతమంది హీరోయిన్లకు ఆకట్టుకునే అందమున్నా.. ఇండస్ట్రీలో సరైన బ్రేక్‌ రాదు. అలాంటి హీరోయినే రాశీ సింగ్‌. 

Image: Instagram/Rashi Singh

ఆది సాయికుమార్‌ ‘శశి’లో నటించిన రాశీసింగ్‌.. ‘పోస్టర్‌’, ‘జెమ్‌’ తదితర చిత్రాల్లో నటించింది. అయినా.. తగిన గుర్తింపు దక్కలేదు. 

Image: Instagram/Rashi Singh

పద్నాలుగేళ్ల వయసులోనే తన కాళ్లపై తను నిలబడేందుకు ఈ ముంబయి బ్యూటీ మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది.

Image: Instagram/Rashi Singh

ఓ వైపు మోడలింగ్‌ చేస్తూనే చదువుపూర్తి చేసి ఎయిర్‌ హోస్టెస్‌గా ఉద్యోగం చేసేది. కొన్నాళ్లకు నటనపై ఆసక్తితో ఉద్యోగం మానేసి ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

Image: Instagram/Rashi Singh

టాలీవుడ్‌లో అవకాశాలు రావడంతో హైదరాబాద్‌కు మకాం మార్చేసింది. ‘జెమ్‌’తో తెరంగేట్రం చేసి.. పలు సినిమాల్లో నటించింది కానీ, సక్సెస్‌ రాలేదు.

Image: Instagram/Rashi Singh

ప్రస్తుతం ఈ బ్యూటీ ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’, ‘పాపం పసివాడు’, సంతోష్‌ శోభన్‌తో ‘ప్రేమ్‌కుమార్‌’లో నటిస్తోంది. ‘ప్రేమ్‌కుమార్‌’ ఆగస్టు 18న విడుదలకానుంది.

Image: Instagram/Rashi Singh

విడుదలకు సిద్ధమవుతోన్న ఈ చిత్రాలతోనైనా గుర్తింపు వస్తుందన్న నమ్మకంతో ఉందీ భామ. 

Image: Instagram/Rashi Singh

బాలీవుడ్‌లో ప్రియాంక చోప్రా, దీపికా పదుకొణె, టాలీవుడ్‌లో అనుష్క శెట్టి, సమంత తనకు అభిమాన హీరోయిన్లు అని గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

Image: Instagram/Rashi Singh

టాలీవుడ్‌ స్టార్‌ హీరో అల్లు అర్జున్‌తో కలిసి నటించాలని ఉందని తన మనసులో మాట బయటపెట్టింది. బన్నీతో నటించాలన్నది తన కల అని చెప్పింది. 

Image: Instagram/Rashi Singh

నటనకు ప్రాధాన్యముంటే.. యంగ్‌ హీరోలతోనే కాదు, సీనియర్‌ హీరోలతోనూ నటించడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పింది. 

Image: Instagram/Rashi Singh

రొమాంటిక్‌ కామెడీ చిత్రాలంటే తనకు చాలా ఇష్టమట. అలాంటి కథల్లోనే నటించడానికి ప్రాధాన్యమిస్తానంటోంది. 

Image: Instagram/Rashi Singh

ఈ భామకు సేవాభావం కూడా ఎక్కువ. తన తల్లి నిర్వహిస్తోన్న ఓ స్వచ్ఛంద సంస్థకు తనవంతు సాయం చేస్తోందట.

Image: Instagram/Rashi Singh

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home