స్వీట్‌ లేనిదే భోజనం అవ్వదు!

రష్మీ గౌతమ్‌ ఎప్పుడూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంటుంది. ఆమె గ్లామరస్‌ పిక్స్‌, వీడియోలకు లైక్‌లు వస్తూనే ఉంటాయి. 

‘హాస్టల్‌ బాయ్స్‌’తో ఇటీవల పెద్ద తెర మీద అలరించిన రష్మి... వారం వారం ‘జబర్దస్త్‌’తో బుల్లితెరపై సందడి చేస్తుంటుంది. 

రష్మి కుటుంబం ఒడిశాకి చెందింది. పుట్టి పెరిగింది విశాఖపట్నంలోనే.

చిన్న తనంలోనే తండ్రిని పోగొట్టుకున్న ఆమె... 14 ఏళ్ల వయసులోనే చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టింది.

ఉదయ్‌ కిరణ్‌ ‘హోలీ’లో ఓ చిన్నపాత్రతో మొదటి సారిగా వెండితెరపై కనిపించింది. ఆ తర్వాత వరుసగా చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూనే ఉంది.

‘జబర్దస్త్’తో యాంకర్‌గా కెరీర్‌ మొదలైంది. తెలుగు అంతగా రాకపోయినా.. అందం, క్యూట్‌ మాటలతో అభిమానుల్ని సంపాదించుకుంది.

ఈటీవీ డ్యాన్స్‌షో ‘ఢీ’లో టీం లీడర్‌గా చేసింది. ఇప్పుడు ‘శ్రీదేవి డ్రామా కంపెనీ’ హోస్ట్‌ కూడా తనే.

టాలీవుడ్‌లోనే కాకుండా.. హిందీ, తమిళ, కన్నడ సినిమాల్లో రష్మి కనిపించింది.

‘‘పరిశ్రమ గురించి ఏమీ తెలియని వయసులోనే వచ్చాను. కొన్ని మంచి పాత్రల్లో నటించాను. కానీ చివరికి వచ్చేసరికి నా సీన్లను తీసేసేవారు. అప్పుడు బాధ పడేదాన్ని’’ అని ఓ సందర్భంలో చెప్పింది. 

‘‘ఎంతగా కష్టపడినా ఇతరుల సపోర్ట్‌ లేకుండా పరిశ్రమలో నిలదొక్కుకోవడం కష్టం. సింగిల్‌ పేరెంట్‌తో ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాను’’ అని చెప్పింది. 

This browser does not support the video element.

 రష్మీకి పారా గ్లైడింగ్‌ అంటే ఇష్టం. కెలోరీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది. అయితే స్వీట్‌ లేనిదే భోజనం పూర్తి చేయదు. 

సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌... ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలోవర్ల సంఖ్య 40లక్షలకు పైమాటే!

‘తరచూ నా గురించి అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంటారు. కానీ వాటి గురించి కుంగిపోతూ ఉంటే జీవితంలో పైకెలా ఎదుగుతాం.. అలాంటి వారికి గట్టిగా తిరిగి సమాధానం చెప్పాల్సిందే’ అంటోంది రష్మి. 

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home