‘గుడ్‌బై’ అంటూ వచ్చేసిన శ్రీవల్లి!
‘పుష్ప’లో శ్రీవల్లి పాత్రతో నేషనల్ క్రష్‌గా మారింది రష్మికా మందనా. బిగ్ బీ అమితాబ్ బచ్చన్‌తో కలిసి ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ‘గుడ్‌బై’ తాజాగా విడుదలైంది.
Image: Instagram/rashmika manadana
ఇటీవల ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమా గురించి.. తన ఇష్టాయిష్టాల గురించి వెల్లడించింది.
Image: Instagram/rashmika manadana
‘గుడ్‌బై’లో అమితాబ్‌తో నటించడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపింది. ఆయన తనకు గురువుగా అన్ని విధాలుగా మద్దతుగా నిలిచారని చెప్పుకొచ్చింది.
Image: Instagram/rashmika manadana
ఇంటర్వ్యూల్లో మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు ఇలా సమాధానాలిచ్చింది.. రష్మిక.
Image: Instagram/rashmika manadana
‘కాఫీ విత్ కరణ్’లాంటి చాట్ షోకి జంటగా వెళ్లాలంటే ఎవరితో వెళ్తారు?
రణ్‌వీర్ సింగ్ లేదా రణ్‌బీర్ కపూర్ వీరిలో ఎవరైనా నాకు ఓకే.
Image: Instagram/rashmika manadana
మీలో మీకు నచ్చని అంశమేంటి?
అతిగా ఆలోచిస్తుంటాను. ఆ అలవాటును మార్చుకోవాలి.
Image: Instagram/rashmika manadana
ఇప్పటి వరకు మీ బెస్ట్ ఫర్మామెన్స్ ఏది?
‘డియర్ కామ్రేడ్’లో నా పాత్ర బాగుంటుంది.
Image: Twitter/rashmika manadana
మీరు చేయాలనుకున్న పాత్ర ఏదైనా ఉందా?
‘గంగూబాయి..’ పాత్రలో నటించాలని అనిపించింది.
Image: Twitter/rashmika manadana
అల్లు అర్జున్ నుంచి ఏం నేర్చుకుంటారు?
ఆయనకున్న డ్యాన్స్ స్కిల్స్.
Image: Instagram/rashmika manadana
విజయ్ దేవరకొండ నుంచి?
విజయ్ ఆలోచనా విధానం. తను చాలా నిజాయితీగా ఉంటాడు.
Image: Instagram/rashmika manadana
ఫీమేల్ లీడ్స్‌తో సినిమా చేయాల్సి వస్తే ఎవరితో కలిసి నటిస్తారు?
ఆలియా భట్.. సమంత. వీరిద్దరితో కలిసి నటించాలని ఉంది.
Image: Instagram/rashmika manadana
డ్యాన్స్ లేదా యాక్షన్ ఒక్క సినిమానే ఎంచుకోవాలంటే?
యాక్షన్ సినిమాని ఎంచుకుంటా. అన్ని సినిమాల్లో డ్యాన్స్ ఉంటుంది. యాక్షన్ జానర్ ఆఫర్ అరుదు కదా..!
Image: Instagram/rashmika manadana
రష్మిక చిత్రాల విషయానికొస్తే ప్రస్తుతం ఆమె.. నాలుగు సినిమాలతో బిజీగా ఉంది. అల్లు అర్జున్ ‘పుష్ప 2’, విజయ్ ‘వారసుడు’తోపాటు బాలీవుడ్‌లో ‘యానిమల్’, ‘మిషన్ మజ్ను’లో నటిస్తోంది.
Image: Instagram/rashmika manadana