‘ఇంకెప్పుడూ నటించకు’ అన్నారు.. రష్మిక 

#Rashmika

నటనపై ఇష్టం లేదుగానీ స్కూల్‌లో ఓసారి స్టేజ్‌ షో చేశా. అది నచ్చక ‘ఇంకెప్పుడూ నటించకు’ అని చాలా మంది అన్నారు. కానీ, ఊహించని విధంగా ఇండస్ట్రీలోకి వచ్చా. 

నా మనసుకు బాగా దగ్గరైన పాత్రల్లో శ్రీవల్లి ఒకటి. ‘పుష్ప’లోని ఈ క్యారెక్టర్‌తో దాదాపు నాలుగేళ్లు ప్రయాణించా. అందుకే షూటింగ్‌ ఆఖరి రోజు ఎమోషనల్ అయ్యా.

నాయికా ప్రాధాన్య చిత్రం ‘రెయిన్‌బో’, ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’, ‘కుబేర’, ‘సికందర్‌’, ‘ఛావా’, ‘థమా’ చిత్రాలతో త్వరలోనే మళ్లీ మీ ముందుకొస్తా.

బయోపిక్స్‌లో నటించాలనుంది. ‘బాహుబలి’లోని దేవసేన పాత్రలాంటిది చేయాలన్నది డ్రీమ్‌.

నాతో ఎవరైనా నవ్వుతూ మాట్లాడకపోతే ఇబ్బంది ఫీలవుతా. ‘గీత గోవిందం’ సెట్‌లో ఓసారి అలాంటి వాతావరణమే ఉండడంతో ఏడ్చేశా. 

బాగా సంపాదించేయాలని ఇండస్ట్రీలోకి రాలేదు. తొలి సినిమాకి రెండున్నర లక్షలు తీసుకున్నా. డబ్బు గురించి పట్టించుకోను గానీ ఏదీ ఫ్రీగా చేయకూడదనుకుంటా.

చిన్నప్పుడు రూ.10 నోట్లు ఇంట్లో కనిపిస్తే దాచేసి, అవసరం ఉన్నవారికి ఇచ్చేదాన్ని. 

ఆటలంటే ఇష్టం. స్కూల్లో స్విమ్మింగ్‌, త్రోబాల్‌లో ఛాంపియన్‌. బ్యాడ్మింటన్‌ కూడా ఆడేదాన్ని.

ఖాళీ సమయం ఉంటే.. పెయింటింగ్‌ వేస్తా. పెట్స్‌తో ఆడుకుంటా. ఎక్కువగా జపనీస్‌ సినిమాలు చూస్తా. కేకు తయారు చేస్తా.

హైదరాబాద్‌ ఇప్పుడు నా హోమ్‌టౌన్‌ అయిపోయింది. కొత్తలో తెలుగు రాక ఇబ్బందిపడినా తర్వాత పట్టుదలతో నేర్చుకున్నా. స్టార్‌ ట్యాగ్‌ నచ్చదు. పని చేసుకుంటూ వెళ్తానంతే. 

నా తొలిప్రేమ కథ నిశ్చితార్థంతోనే ఆగిపోయింది. దాని వల్ల ప్రేమపై నా నమ్మకాలేమీ మారలేదు. ప్రేమ గొప్పది. అది చూసే కళ్లను బట్టి ఉంటుంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

‘దబిడి దిబిడి’.. ఊర్వశి సందడి

ఓటీటీలో.. గ్రేటెస్ట్‌ కార్‌ మూవీస్‌

Eenadu.net Home