టాటా దత్త మనవడి కుమారుడు.. దిగ్గజ వ్యాపారవేత్త

రతన్‌ టాటా డిసెంబర్‌ 28, 1937న జన్మించారు. ఆయన తండ్రి నావల్‌ టాటా జెంషేడ్‌జీ టాటాకి దత్త మనవడు. 

కార్నెల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ కాలేజ్‌లో ఆర్కిటెక్చర్‌లో డిగ్రీ చదువుకున్నారు. ఆ తర్వాత హార్వర్డ్‌ యూనివర్సిటీలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ పట్టా అందుకున్నారు. 

ఈయన వివాహం చేసుకోలేదు. ప్రేమ విఫలం కావడం, పెళ్లి ప్రయత్నాలు వివిధ కారణాలతో ఆగిపోవడంతో ఒంటరిగానే ఉండిపోయారు. 

టాటా గ్రూప్‌కి అధినేతే అయినా.. చిన్న ఉద్యోగంతోనే ఆయన ప్రయాణం మొదలుపెట్టారు. 1961లో తొలిసారిగా టాటాస్టీల్‌లో సూపర్‌వైజర్‌గా విధులు నిర్వర్తించారు. 

రతన్‌ టాటా హయాంలోనే లాండ్‌ రోవర్‌, జాగ్వార్‌ కార్ల తయారీ సంస్థలు, కోరస్‌ స్టీల్‌, టెట్లీ టీ కంపెనీ టాటా సంస్థలో విలీనమయ్యాయి. టాటా గ్రూప్‌ అభివృద్ధికి ఇవి ఎంతగానో ఉపకరించాయి. 

తాను ఇచ్చిన మాట ప్రకారం 2009లో రూ. 1లక్షకే ‘నానో’ కారును అందుబాటులోకి తెచ్చారు. కానీ, ఆ కారు ప్రజల్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. 

రతన్‌ టాటా శిక్షణ పొందిన పైలట్‌. ఎఫ్‌-16 ఫాల్కన్‌ విమానం నడిపిన తొలి భారతీయుడిగా రికార్డు సృష్టించారు. 

దాతృత్వంలో గొప్పవ్యక్తి. తన కుటుంబం, సంస్థల ఆదాయంలో 60 శాతానికిపైగా విరాళంగా ఇస్తుంటారు. అందుకే, ఆయన సంపన్నుల జాబితాలో కనిపించరు. 

రతన్‌ టాటాకి శునకాలంటే చాలా ఇష్టం. దీంతో ముంబయిలో టాటా సన్స్‌కి ప్రధాన కార్యాలయంగా ఉన్న ‘బాంబే హౌస్‌’ను వీధి శునకాలకు ఆశ్రమంగా మార్చేశారు. 

శంతను నాయుడు అనే యువకుడిని రతన్‌ టాటా తన సహాయకుడిగా నియమించుకున్నారు. రతన్‌ బాగోగులన్నీ అతడే చూసుకుంటాడు.

‘‘సరైన నిర్ణయాలు తీసుకోవాలి అనేదానిపై నాకు నమ్మకం లేదు. నేను నిర్ణయాలు తీసుకొన్న తర్వాత వాటిని సరి చేస్తాను’’

‘‘మనం జీవితంలో ముందుకు వెళ్లాలంటే ఎత్తుపల్లాలు చాలా ముఖ్యం. అవి లేకుండా ఈసీజీలో కనిపించే గీతలా తిన్నగా సాగిపోతే మనం జీవించిలేనట్టే’’

‘‘ఇనుమును ఎవరూ నాశనం చేయలేరు. కానీ, దాని తుప్పే నాశనం చేస్తుంది. అలాగే.. మనిషిని మరొకరు నాశనం చేయలేరు. కానీ, సొంత మనస్తత్వం చేయగలదు’’

వీళ్లు ట్యాక్స్‌ ఎంత కడుతున్నారో తెలుసా?

మెటల్‌ మెరుపులు అద్దుకున్న క్రెడిట్‌ కార్డులివే

రాంగ్‌ నంబర్‌కి యూపీఐ పేమెంట్‌ చేశారా?

Eenadu.net Home