ఐపీఎల్‌ చూస్తూ ఆర్సీబీ.. అంటూ అరిచేదాన్ని

ఐపీఎల్‌లో ఆడి ఎంతో మంది క్రికెటర్లు తమ ప్రతిభను చాటుకున్నారు. కానీ, ఐపీఎల్‌ను చూసి క్రికెటర్‌గా మారాలనుకుంది శ్రేయాంక పాటిల్‌.


ఆల్‌రౌండర్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. ప్రస్తుతం మహిళల ప్రీమియర్‌ లీగ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(ఆర్సీబీ)కి ప్రాతినిధ్యం వహిస్తోంది.

డబ్ల్యూపీఎల్‌లో ఇప్పటి వరకు 13 మ్యాచ్‌లు ఆడిన శ్రేయాంక.. 78 పరుగులు, 13 వికెట్లు తీసింది. అంతర్జాతీయ క్రికెట్‌లోనూ రాణిస్తోంది. 

కర్ణాటక రాజధాని బెంగళూరులో 2002న జన్మించిన శ్రేయాంకకి చిన్నతనం నుంచి క్రికెట్‌ అంటే ఇష్టం. ముఖ్యంగా ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టుకు పెద్ద ఫ్యాన్‌.

‘‘ఐపీఎల్‌ చూస్తూ ఆర్సీబీ.. ఆర్సీబీ అంటూ అరిచే దాన్ని.. ఇప్పుడు అదే జట్టుకు ఆడుతుంటే ప్రేక్షకులు నా పేరు పలుకుతున్నారు’’అని సంతోషం వ్యక్తం చేసింది. 

దేశీయ క్రికెట్‌లోకి 2019లో అడుగుపెట్టిన ఈ యంగ్‌ ప్లేయర్‌.. కర్ణాటక రాష్ట్ర క్రికెట్‌ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తోంది. తొలి మ్యాచ్‌తోనే ఆకట్టుకొని జట్టుకు కీలకంగా మారింది.

2023 జనవరిలో అరుణాచల్‌ ప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 73 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆమెకు డబ్ల్యూపీఎల్‌లో ఆర్సీబీ అవకాశం ఇచ్చింది.

శ్రేయాంక ఎంతగానో అభిమానించే ఆర్సీబీ జట్టు.. ఐపీఎల్‌ వేలంలో ఆమెను రూ. 10 లక్షల ధరకు జట్టులోకి తీసుకుంది. అలా 2023లో జరిగిన తొలి డబ్ల్యూపీఎల్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో అదరగొట్టింది. 

అదే ఏడాది అంతర్జాతీయ క్రికెట్‌లోనూ అరంగేట్రం చేసింది. మొత్తం 2 వన్డేలు, 6 టీ20లు ఆడింది. కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో టాప్‌ వికెట్‌ టేకర్‌గా నిలిచింది.  

‘డెత్‌ ఓవర్స్‌ వేయడానికి ఇష్టపడతా. అందులో భిన్నమైన సవాళ్లుంటాయి. నాలాంటి ఆఫ్‌ స్పిన్నర్‌కి అది మరింత సవాలే’అనే గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

విరాట్‌ కోహ్లీకి, మహిళల్లో స్మృతి మంధాన, ఎలిస్‌ పెర్రీకి శ్రేయాంక విరాభిమాని. మొదటిసారి డబ్ల్యూపీఎల్‌ ఆడుతున్నప్పుడు కోహ్లీ ఇచ్చిన ప్రసంగం జట్టుకు బలానిచ్చిందని తెలిపింది.

ఐపీఎల్‌లో అత్యధిక డకౌట్స్‌ వీళ్లవే!

సెంచరీల్లో అగ్రస్థానం ‘కింగ్‌’దే.. తర్వాత ఎవరు?

ఒకే ఓవర్‌లో దంచి కొట్టారు

Eenadu.net Home