రెజీనా హొయలు.. అదిరిన కుర్రాళ్ల గుండెలు

ఓ వైపు గ్లామర్‌ పాత్రలతో మెప్పిస్తూ, మరోవైపు వైవిధ్యమైన పాత్రల్లో సత్తా చాటి మంచి నటిగా దూసుకుపోతోంది రెజీనా.

Source: Instagram/Regina Cassandra

14 ఏళ్ల వయసులో ‘కాండ నాల్ ముదల్‌’ అనే తమిళ సినిమాలో హీరోయిన్‌ చెల్లి పాత్ర చేసింది. అదే ఆమె మొదటి సినిమా.

Source: Instagram/Regina Cassandra

‘ఎస్‌.ఎమ్‌.ఎస్‌’తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఎన్నో సినిమాల్లో కథానాయికగా ప్రేక్షకుల్ని అలరించింది.

Source: Instagram/Regina Cassandra

సతీష్ కాశెట్టి దర్శకత్వంలో ‘మరీచిక’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రెజీనా కసాండ్ర, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రధారులు.

Source: Instagram/Regina Cassandra

ఈ ముద్దుగుమ్మ 1990 డిసెంబరు 13న చెన్నైలో జన్మించింది.

Source: Instagram/Regina Cassandra

‘సుబ్రహ్మణ్యం ఫర్‌ సేల్‌’, ‘జ్యో అచ్యుతానంద’, ‘అ!’, ‘రారా కృష్ణయ్య’, ‘ఎవరు’ చిత్రాల ద్వారా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకుందీ భామ. 

Source: Instagram/Regina Cassandra

‘ఆచార్య’లో ‘సానా కష్టం వచ్చిందే మందాకినీ’ అనే ప్రత్యేక గీతంలో మెగాస్టార్‌ చిరంజీవితో స్టెప్పులేసి కుర్రకారు గుండెల్లో కల్లోలం రేకెత్తించింది.

Source: Instagram/Regina Cassandra

ఓ వైపు సినిమాలు చేస్తూనే పలు వెబ్‌ సిరీస్‌ల్లో నటిస్తోంది రెజీనా.

Source: Instagram/Regina Cassandra

‘నేనే నా’ అనే చిత్రంలో రెజీనా ద్విపాత్రాభినయం చేసింది. ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.

Source: Instagram/Regina Cassandra

కొరియన్‌ చిత్రం ‘మిడ్‌ నైట్‌ రన్నర్స్‌’ ఆధారంగా తెలుగులో రూపొందిన చిత్రం ‘శాకినీ- ఢాకినీ’. రెజీనా, నివేదా థామస్‌ ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

Source: Instagram/Regina Cassandra

రెజీనా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అభిమానులతో పంచుకుంటుంది.

Source: Instagram/Regina Cassandra

ఇన్‌ స్టాలో ఆమెకి 1.9 మిలియన్ల ఫాలోవర్స్‌ ఉన్నారు.

Source: Instagram/Regina Cassandra

ఓటీటీలో అలరించడానికి సిద్ధమైన సినిమాలు/సిరీస్‌లు

స్కూల్‌లో ప్రపోజ్‌ చేసి.. గుడిలో పెళ్లి చేసుకుని..

ఓనం సొగసుల్‌.. అదిరెన్‌..

Eenadu.net Home