షూటింగ్‌లోనే కాదు..

ఫ్యాషన్‌లోనూ స్టారే

భారత షూటర్‌ రిథమ్‌ సంగ్వాన్‌ పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధించింది. చిన్న వయసు (20)లోనే ఈ ఘనత సాధించడం గమనార్హం.

హరియాణాకు చెందిన రిథమ్‌ తండ్రి నరేందర్ కుమార్‌ పోలీసు. తల్లి నీలమ్‌ గృహిణి. రిథమ్ సక్సెస్‌ వెనుక తల్లిదే కీలక పాత్ర.

పిస్టల్‌ షూటింగ్‌లో అదరగొట్టిన రిథమ్‌ చదువులోనూ టాపర్. 12వ తరగతిలో 95 శాతం మార్కులు సాధించింది. 

ఓవైపు క్రీడల్లో రాణిస్తూనే విద్యనభ్యసిస్తోంది. ఆమె ప్రస్తుతం లేడీ శ్రీరామ్‌ కళాశాలలో గ్రాడ్యుయేషన్‌ చేస్తోంది.

రిథమ్ సోషల్‌ మీడియాలోనూ యాక్టివే. ఇటు ఫ్యాషన్‌, అటు ట్రెడిషన్‌ కలగలిపి ఇన్‌స్టాలో సందడి చేస్తూ ఉంటుంది.

కొత్త ప్రదేశాలకు వెళ్లడమంటే చాలా ఇష్టం. అలాగే అక్కడి టూరిస్ట్‌ ప్రాంతాల్ని కెమెరాలో బంధించడం, షేర్‌ చేయడం తన హాబీ.

This browser does not support the video element.

విదేశాలకు వెళ్లినప్పుడు షాపింగ్ చేయకుండా రిథమ్‌ స్వదేశానికి రావడం చాలా అరుదు. 

చేతికి పిస్టలే కాదు.. పియానో ఇచ్చినా సంగీతంతో అదరగొడుతుంది.

రిథమ్‌కు నీలం రంగు అంటే చాలా ఇష్టం. ఆమె ఇన్‌స్టా ఫొటోల్లో చాలా వరకు ఆ రంగు దుస్తులే దర్శనమిస్తాయి.

61వ జాతీయ షూటింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో రిథమ్‌ 3 బంగారు పతకాలు సాధించింది.

గతేడాది బాకు వేదికగా జరిగిన పోటీల్లో 25 మీటర్ల పిస్టల్‌ విభాగంలో 595 పాయింట్లతో 29 ఏళ్ల నాటి రికార్డును అధిగమించింది. 

2023లో స్పోర్ట్స్‌ స్టార్‌ ఏసెస్‌ అవార్డును దక్కించుకుంది. అత్యుత్తమ యంగ్‌ అచీవర్‌గానూ నిలిచింది.

IPL వేలం: ఈ ఏడాది టాపర్‌ పంత్‌.. మరి గతంలో?

IPL: ఈసారి వీళ్లే టాక్‌ ఆఫ్‌ ది ఆక్షన్‌

IPL వేలం: 2022లో ₹ 551.7 కోట్లు... మరిప్పుడు ఎంత?

Eenadu.net Home