రిద్ది.. ప్రభాస్‌తో అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా!

ప్రభాస్‌ నటించిన ‘రాధే శ్యామ్‌’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించింది యంగ్‌ బ్యూటీ రిద్ది కుమార్‌. ఇప్పుడు ప్రభాస్‌కి జోడిగా నటించనుందట. 

Image:Instagram/Riddhi Kumar

ప్రభాస్‌-మారుతి కాంబినేషన్‌లో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో ముగ్గురు హీరోయిన్లు ఉండగా.. వారిలో ఒకరిగా చిత్రబృందం రిద్దిని ఎంపిక చేసినట్టు సమాచారం.

Image:Instagram/Riddhi Kumar

మహారాష్ట్రలోని పుణెలో జన్మించిన రిద్ది.. ఫిలాసఫీలో డిగ్రీ పూర్తి చేసింది. టీనేజ్‌లోనే గ్లామర్‌ ప్రపంచంపై ఆసక్తి ఏర్పడింది.

Image:Instagram/Riddhi Kumar

అలా చదువుకుంటూనే మోడలింగ్‌ చేసేది. పలు ఫ్యాషన్‌ షోలలో ర్యాంప్‌ వాక్‌ చేసిన ఈ భామ.. పలు బ్రాండ్స్‌ ప్రచార చిత్రాల్లోనూ నటించింది. 

Image:Instagram/Riddhi Kumar

ఫేస్‌ ఆఫ్ ఇండియా అందాల పోటీల్లో ‘క్యూటెస్ట్‌ ఫేస్‌’గా నిలిచింది. ఆ తర్వాత టాలీవుడ్‌ నుంచి పిలుపొచ్చింది. 

Image:Instagram/Riddhi Kumar

రాజ్‌తరుణ్‌ హీరోగా 2018లో విడుదలైన ‘లవర్‌’తో టాలీవుడ్‌ కథానాయికగా మారింది రిద్ది. అదే ఏడాది ‘అనగనగా ఓ ప్రేమకథ’లోనూ నటించింది.

Image:Instagram/Riddhi Kumar

ఆ తర్వాత మలయాళం, మరాఠీ చిత్రాల్లో నటించింది. ఆయా సినిమాలకు మిశ్రమ ఫలితాలు వచ్చినా.. నటిగా రిద్దికి మంచి మార్కులే పడ్డాయి.

Image:Instagram/Riddhi Kumar

This browser does not support the video element.

బాలీవుడ్‌లో ‘క్యాండీ’, ‘హ్యూమన్‌’ వెబ్‌సిరీస్‌లతో ఓటీటీలోకీ అడుగుపెట్టింది. 

Image:Instagram/Riddhi Kumar

ప్రభాస్‌ ‘రాధే శ్యామ్‌’లో చిన్న పాత్ర పోషించింది. రైలు ప్రమాదంలో చేయి కోల్పోయే అమ్మాయిగా కనిపించింది. నిడివి తక్కువే అయినా.. కీలకమైన పాత్ర తనది.

Image:Instagram/Riddhi Kumar

తాజాగా ప్రభాస్‌ సరసన నటించే అవకాశం దక్కించుకుంది. ఆయన చాలా కూల్‌గా ఉంటారని, అందరితో కలిసిపోతారని ‘రాధే శ్యామ్‌’ ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చింది. 

Image:Instagram/Riddhi Kumar

This browser does not support the video element.

ప్రస్తుతం రిద్ది చేతిలో మరో రెండు సినిమాలు, ఓ వెబ్‌సిరీస్‌ ప్రాజెక్టులున్నాయి. త్వరలోనే అవి విడుదలకానున్నాయి. 

Image:Instagram/Riddhi Kumar

తన సినిమాలు, వ్యక్తిగత విషయాలను సోషల్‌మీడియా ద్వారా తెలియజేస్తూ అభిమానులు, నెటిజన్లకు చేరువగానే ఉంటోంది.

Image:Instagram/Riddhi Kumar

This browser does not support the video element.

రిద్ది మంచి చిత్రకారిణి కూడా. కుట్లు, అల్లికల్లోనూ ప్రావీణ్యముంది. తను వేసిన ఆర్ట్స్‌ను చూపించడం కోసం ప్రత్యేకంగా ఇన్‌స్టా ఖాతాను తెరిచింది. అందులో చూడచక్కని పెయింటింగ్స్‌ దర్శనమిస్తాయి.

Image:Instagram/Riddhi Kumar

సెల్ఫీ బ్యూటీస్‌

ఒంటికి యోగా మంచిదేగా..!

రష్మీ.. అనసూయ బాటలో కొత్త యాంకర్‌..

Eenadu.net Home