రితికా.. సొగసుల తారక
మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో జాతీయ స్థాయి క్రీడాకారిణిగా రాణించిన రితికా సింగ్.. క్రీడల నేపథ్యంతో సాగే చిత్రంతోనే రంగుల ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
Image: Instagram/ritika singh
గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఈ భామ.. మూడేళ్ల తర్వాత ‘హత్య’తో మరోసారి ప్రేక్షకుల ముందుకొచ్చింది.
Image: Instagram/ritika singh
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన ఈ చిత్రం జులై 21న విడుదలైంది. ఇందులో రితికా ఐపీఎస్ ఆఫీసర్ సంధ్య పాత్రలో నటించి మెప్పించింది.
Image: Instagram/ritika singh
మహారాష్ట్రలో పుట్టి పెరిగిన రితికా.. చిన్న వయసు నుంచే మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకుంది.
Image: Instagram/ritika singh
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రతిభ చాటి.. 2009లో జరిగిన ఆసియా క్రీడల్లోనూ పాల్గొంది. ఆ తర్వాత దేశీ ‘సూపర్ ఫైట్ లీగ్’లోనూ పోటీ పడింది.
Image: Instagram/ritika singh
ఈమెను చూసిన దర్శకురాలు సుధ కొంగర తను దర్శకత్వం వహించిన ‘ఇరుది సుట్రు(హిందీలో సాలా ఖాడూస్ - 2016)’లో అవకాశమిచ్చారు. ఇందులో బాక్సర్‌గా కనిపించింది.
Image: Instagram/ritika singh
‘ఇరుది సుట్రు’కి గానూ రితికాకు నేషనల్ అవార్డు కూడా లభించింది. ఈ చిత్రాన్నే తెలుగులో వెంకటేశ్‌తో ‘గురు’గా రీమేక్ చేశారు.
Image: Instagram/ritika singh
తెలుగు, తమిళ్, హిందీలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాక్సర్ పాత్రను రితికానే పోషించింది. ఈమె నటనకు మూడు భాషల్లోనూ ఫిల్మ్‌ఫేర్ అవార్డుతోపాటు మరెన్నో అవార్డులు వరించాయి.
Image: Instagram/ritika singh
రాఘవ లారెన్స్ ‘శివలింగ’, ఆది పినిశెట్టి ‘నీవెవరో’లో నటించింది. 2020లో వచ్చిన ‘ఓ మై కడవులే’తర్వాత సినిమాల్లో కనిపించలేదు.
Image: Instagram/ritika singh
మళ్లీ ఈ ఏడాదిలోనే ‘స్టోరీ ఆఫ్ థింగ్స్(తమిళ్)’ వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాలీవుడ్‌లో విడుదలైన ‘ఇన్‌కార్’ చిత్రంలో నటించింది.
Image: Instagram/ritika singh
తాజాగా ఈమె నటించిన ‘హత్య’ విడుదల కాగా.. దుల్కర్ సల్మాన్ ‘కింగ్ ఆఫ్ కోత’లో అతిథి పాత్ర పోషించింది.
Image: Instagram/ritika singh
ఓ వైపు నటిస్తూనే స్పోర్ట్స్ కెరియర్‌ను కొనసాగిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ దక్షిణాఫ్రికాలో జరిగిన ‘కేఎస్‌ఐ కరాటే వరల్డ్ ఛాంపియన్‌షిప్’లో పాల్గొంది.
Image: Instagram/ritika singh
This browser does not support the video element.
సోషల్‌మీడియాలో యాక్టీవ్‌గా ఉండే రితికా.. తన గ్లామర్ పిక్స్‌తోపాటు బాక్సింగ్, కరాటేలో శిక్షణ తీసుకుంటోన్న వీడియోలను కూడా పోస్ట్ చేస్తుంటుంది. ఈమెకు ఇన్‌స్టాలో 3.3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
Image: Instagram/ritika singh