డాక్టర్ కమ్ యాక్టర్.. ఈ తెలుగందం
డాక్టర్ కాబోయి.. యాక్టర్ అయ్యారనే నానుడి సినిమా ఇండస్ట్రీలో అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది. కానీ, నిజంగా డాక్టర్లయిన యాక్టర్లూ ఇండస్ట్రీలో ఉన్నారు. అందులో ఒకరు రూపా కొడువయూర్.
(Photos: Instagram/Roopa Koduvayur)
తొలి సినిమా‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’తోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రూప.. చాలా కాలం తర్వాత మరోసారి తెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.
తాజాగా బిగ్‌బాస్ ఫేమ్ సయ్యద్ సొహైల్ నటించిన ‘మిస్టర్ ప్రెగ్నెంట్’లో రూపానే హీరోయిన్. ఈ సినిమా ఆగస్టు 18న విడుదలకానుంది.
రూప.. విజయవాడలో డిసెంబర్ 27, 1996న జన్మించింది. ఆరేళ్ల వయసు నుంచే భరతనాట్యం, కూచిపూడిలో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టిందట.
వివిధ వేదికలపై నాట్య ప్రదర్శన ఇచ్చిన రూప.. ‘నాట్య మయూరి’తోపాటు ఎన్నో పురస్కారాలు అందుకుంది.
స్కూల్, కాలేజీలో కల్చరల్ ప్రొగ్రామ్స్‌లో చురుకుగా పాల్గొనేది. ‘ఫౌజీ’, ‘నో- సే యస్ టు నో’ తదితర షార్ట్‌ఫిల్మ్స్‌లోనూ నటించింది.
సత్యదేవ్ హీరోగా నటించిన‘ఉమామహేశ్వర..’ ఆడిషన్ గురించి స్నేహితుల ద్వారా తెలుసుకొని అందులో పాల్గొంది. సినిమాలోని హీరోయిన్ పాత్రకు ఈమె సరిగ్గా సరిపోవడంతో ఎంపికైంది.
ఈ సినిమాలో రూప సహజ నటన అందరినీ ఆకట్టుకుంది. అలాగే, తను చేసిన డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఉత్తమ పరిచయ నాయికగా సైమా అవార్డు కూడా సొంతం చేసుకుంది.
ఆ తర్వాత సత్యదేవ్‌తో కలిసి ‘దారే లేదా’అనే వీడియో సాంగ్ చేసింది. ‘యమకాతగి’చిత్రంతో తమిళ్‌లోనూ ఎంట్రీ ఇచ్చింది.
రూప తల్లి క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. అప్పుడే రూప డాక్టర్ అవ్వాలని నిర్ణయించుకుందట. అనుకున్నట్లే గుంటూరులో ఎంబీబీఎస్ పూర్తి చేసింది.
కొవిడ్ సమయంలో ఎంతో మందికి వైద్యసేవలందించిన రూప.. క్యాన్సర్ స్పెషలిస్ట్(ఆంకాలజీ) అవ్వడానికి సిద్ధమవుతోందట.
డాక్టర్ వృత్తిని కొనసాగిస్తూనే సినిమాలు చేస్తానని అంటోంది. చిన్నప్పట్నుంచి తనకు మల్టీటాస్కింగ్ అలవాటేనని.. వృత్తి, సినిమాను కూడా సులభంగా సమన్వయం చేసుకుంటానని చెబుతోంది.