ఖుబ్‌సూరత్.. ఈ రూబల్ షెకావత్!
కొత్తవారికి సినిమా అవకాశం రావడమే కష్టం. అలాంటిది, రూబల్ షెకావత్ అటుఇటుగా ఒకేసారి రెండు తెలుగు సినిమాలతో టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది.
Image: Instagram/rubal shekhawat
తాజాగా మంచు మనోజ్ నటిస్తోన్న ‘వాట్ ది ఫిష్’లో, రవితేజ సోదరుడి కుమారుడు మాధవ్ హీరోగా పరిచయమవుతున్న ‘ఏయ్ పిల్లా’లో రూబలే హీరోయిన్.
Image: Instagram/rubal shekhawat
ఇంతకీ ఎవరీమె అనుకుంటున్నారా..? ఫెమినా మిస్ ఇండియా - 2022 పోటీల్లో తొలి రన్నరప్. మోడల్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు హీరోయిన్‌గా మారింది.
Image: Instagram/rubal shekhawat
రాజస్థాన్‌లోని జైపుర్‌లో రూబల్ జన్మించింది. ఆర్మీ నేపథ్యమున్న కుటుంబమే అయినా.. రూబల్‌కి చిన్నప్పట్నుంచీ ఫ్యాషన్, నటన అంటే ఆసక్తి.
Image: Instagram/rubal shekhawat
చదువు పూర్తి కాగానే.. తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ముంబయికి వచ్చి మోడల్‌గా కెరీర్ ప్రారంభించింది.
Image: Instagram/rubal shekhawat
ఫ్యాషన్ షోల్లో పాల్గొంటూ పలు బ్రాండ్స్ ప్రచార చిత్రాల్లో నటించింది రూబల్. రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ఓ యాడ్‌లో మెరిసింది.
Image: Instagram/rubal shekhawat
ఫెమినా మిస్ ఇండియా పోటీల్లో రాజస్థాన్ తరఫున పాల్గొంది. ఆ పోటీల్లో సినీ శెట్టి మిస్ ఇండియా కిరీటం దక్కించుకోగా.. రూబల్ తొలి రన్నరప్‌గా నిలిచింది.
Image: Instagram/rubal shekhaw
అందాల పోటీల్లో పాల్గొనడంతో రూబల్‌కు రంగుల ప్రపంచంలో గుర్తింపు లభించింది. సినీ అవకాశాలు వస్తున్నాయి.
Image: Instagram/rubal shekhawat
టాలీవుడ్ నుంచి పిలుపురావడంతో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.
Image: Instagram/rubal shekhawat
ఇటీవల ఇమ్రాన్ హష్మీతో కలిసి ‘ఇష్క్ నహీ కర్తే’ హిందీ మ్యూజిక్ వీడియోలో నటించింది.
Image: Instagram/rubal shekhawat
రూబల్.. ఇంటర్నేషనల్ బిజినెస్ ఆపరేషన్స్‌లో పీజీ చేసింది. రాజస్థాన్‌లోని కళాకారులను ప్రోత్సహించే విధంగా ఓ బిజినెస్ ప్రారంభించాలని ప్రయత్నాలు చేస్తోంది.
Image: Instagram/rubal shekhawat
హీరోల్లో తనకు షారుక్ ఖాన్ అంటే చాలా ఇష్టమని.. ఆయనతో నటించాలని ఉందంటూ రూబల్.. గతంలో ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.
Image: Instagram/rubal shekhawat