‘హలో వరల్డ్’ అంటూ వచ్చిన సదా..!
వయసు పెరుగుతున్నా.. తన అందంతో ఫిదా చేస్తోంది.. నటి సదా.
Image: Instagram/Sadaa
చాలా కాలం తర్వాత ఆమె ఓ వెబ్‌సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఆమె నటించిన ‘హలో వరల్డ్’ సిరీస్ ఆగస్టు 12న జీ5 వేదికగా విడుదల కానుంది.
Image: Instagram/Sadaa
ఈ నేపథ్యంలో సదా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు..
Image: Instagram/Sadaa
సదా పూర్తి పేరు సదా మహమ్మద్ సయ్యద్. మహారాష్ట్రలోని రత్నగిరిలో 1984 ఫిబ్రవరి 17న జన్మించింది.
Image: Instagram/Sadaa
సదాకు చిన్నతనం నుంచే నటన, డ్యాన్స్‌పై ఆసక్తి ఉండేది. పదో తరగతిలోనే సినిమా అవకాశం వస్తే తల్లిదండ్రులు ఒప్పుకోలేదట.
Image: Instagram/Sadaa
ముంబయిలో ఇంజినీరింగ్ చదువుకుంటూనే యాక్టింగ్ స్కూల్‌లో చేరింది. అప్పుడే తేజ దర్శకత్వం వహించిన ‘జయం’లో సదాకు అవకాశం వచ్చింది.
Image: Instagram/Sadaa
తొలి చిత్రంతోనే సదాకు పాపులారిటీ పెరగడమే కాదు.. ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డూ లభించింది.
Image: Instagram/Sadaa
ఆ తర్వాత ప్రాణం, నాగ, దొంగ-దొంగది, లీలా మహల్ సెంటర్, ఔనన్నా.. కాదన్నా, వీరభద్ర, క్లాస్‌మేట్ తదితర చిత్రాల్లో నటించింది.
Image: Instagram/Sadaa
తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 40కిపైగా చిత్రాల్లో సదా నటించింది.
Image: Instagram/Sadaa
2005లో శంకర్ తెరకెక్కించిన ‘అపరిచితుడు’ సదాకు మరింత క్రేజ్ తెచ్చిపెట్టింది. కానీ, ఆ తర్వాత నటించిన సినిమాలు ఆమెకు అనుకున్నంత సక్సెస్ ఇవ్వలేదు.
Image: Instagram/Sadaa
‘చంద్రముఖి’, ‘ఆనంద్’ సినిమాల్లో హీరోయిన్‌గా నటించే అవకాశం వచ్చినా.. వివిధ కారణాలతో సదా వాటిని మిస్ చేసుకుంది.
Image: Instagram/Sadaa
2015 వరకు వరసపెట్టి సినిమాలు చేసిన సదా.. ఆ తర్వాత వెండితెరపై కనిపించడం తగ్గించింది. 2018లో ‘టార్చ్‌లైట్’ చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించింది.
Image: Instagram/Sadaa
ఈ టీవీలో ప్రసారమవుతోన్న డ్యాన్స్ షో ‘ఢీ’లో కొన్ని సీజన్లు, ‘జబర్దస్త్’ కామెడీ షోలో కొన్ని ఎపిసోడ్లలో జడ్జ్‌గా వ్యవహరించింది సదా.
Image: Instagram/Sadaa
సోషల్‌మీడియాలోనూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన ఫొటోలను ఎప్పటికప్పుడు పోస్టు చేస్తుంటుంది. ఆమె అందానికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
Image: Instagram/Sadaa
ప్రస్తుతం ఓ కన్నడ చిత్రంతోపాటు తెలుగులో ఇటీవల హిట్ కొట్టిన ‘డీజే టిల్లు’ సీక్వెల్‌లో సదా నటిస్తున్నట్లు సమాచారం.
Image: Instagram/Sadaa
ఈ అమ్మడు వీగన్.. జంతుహక్కుల పోరాటాలకు మద్దతిస్తుంటుంది. తను తోలు ఉత్పత్తులను అస్సలు వినియోగించదు.
Image: Instagram/Sadaa
ముంబయిలో ‘ఎర్త్‌లింగ్స్ కేఫ్’ పేరుతో శాకాహార రెస్టారెంట్‌ను,‘సదాస్ గ్రీన్ లైఫ్’ పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను నిర్వహిస్తోంది సదా.
Image: Instagram/Sadaa