మేకప్‌కి దూరంగా.. పాత్రకి దగ్గరగా!

అందం కంటే అభినయం ప్రధానమని నమ్మే హీరోయిన్లలో సాయి పల్లవి ఒకరు. నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా కొన్ని సంగతులు..

‘కస్తూరి మాన్‌’లో నిడివి తక్కువ పాత్రతో తెరంగేట్రం చేసిన ఆమె ‘ధామ్‌ ధూమ్‌’లో కంగనా రనౌత్‌ పక్కన కనిపించారు.

తర్వాత డ్యాన్స్‌పై దృష్టి పెట్టి, ‘ఢీ’ షోలో అవకాశం సొంతం చేసుకున్నారు.

ఆ షో వల్ల హీరోయిన్‌గా అవకాశాలు రాగా పేరెంట్స్ వద్దని, జార్జియాలో మెడిసిన్‌లో చేర్పించారు.

దర్శకుడు అల్ఫోన్స్‌ ‘ప్రేమమ్‌’ ఛాన్స్‌ ఇవ్వగా.. సెలవుల్లో నటించేందుకు ఆమె తండ్రి అంగీకరించారు.

దాని తర్వాత ‘కలి’లో నటించారు. అదే సమయంలో చదువు పూర్తయింది. ఆ తర్వాత ‘ఫిదా’లో నటించి, తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

మొటిమలు ఉన్న తనను ఆడియన్స్‌ అంగీకరిస్తారో, లేదోనన్న భయం తొలినాళ్లలో ఉండేదని ఓ సందర్భంలో చెప్పారు.

‘‘మేకప్‌ వేస్తే నువ్వు నీలా కనిపించడం లేదు తీసేయమని నా ప్రతి చిత్ర దర్శకుడు చెబుతుంటారు. అందుకే నేను మేకప్‌కి దూరంగా.. పాత్రకి దగ్గరగా ఉంటా’’ అని తెలిపారు.

తన డ్యాన్స్‌ని అల్లు అర్జున్‌ ప్రశంసించడం ఎప్పటికీ మర్చిపోలేనన్నారు.

ఈ నటికి వాణిజ్య ప్రకటనల్లో కనిపించడం ఇష్టం ఉండదు. 

సూర్యకు అభిమాని. రన్నింగ్‌ చేయడమంటే సరదా. హారర్‌ చిత్రాలు చూడాలంటే భయం.

ఖాళీ సమయంలో డ్రైవింగ్‌ చేయడమో, సీతాకోక చిలుకలను పట్టుుకుని వదిలేడమో చేస్తుంటారు. తెలుగులో ‘తండేల్’, తమిళ్‌లో ‘అమరన్‌’ చిత్రాల్లో నటిస్తున్నారు.

వాహ్వా.. వహీదా..!

గిటార్‌ ఇష్టం... బన్నీ ఇంకా ఇష్టం

ఈవారం ఓటీటీ సినిమాలు/సిరీస్‌లు

Eenadu.net Home