చిరుతో స్టెప్పులేయడం నా అదృష్టం!

‘హుషారు’తో తెలుగు తెరపై ఎంట్రీ ఇచ్చిన తెలుగమ్మాయి.. రమ్య పసుపులేటి ప్రస్తుతం ‘మారుతీ నగర్‌ సుబ్రమణ్యం’తో ప్రేక్షకుల ముందుకు రానుంది.

కామెడీ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి లక్ష్మణ్‌ కర్యా దర్శకత్వం వహించారు. ఇందులో రావు రమేష్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. అంకిత్ కొయ్య హీరో.

ఈ భామ విషయానికొస్తే హైదరాబాద్‌(2001)లో పుట్టింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా, మోడల్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

ఫుడ్‌, ఫ్యాషన్‌, ట్రావెలింగ్‌ గురించి వీడియోలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభిమానుల్ని సంపాదించుకుంది. దీంతో సినీ అవకాశాలొచ్చాయి.

‘#బీఎఫ్‌ఎఫ్‌’ వెబ్‌ సిరీస్‌తో పాటు ‘హుషారు’, ‘మైల్స్‌ ఆఫ్‌ లవ్‌’, ‘ఫస్ట్‌ ర్యాంక్ రాజు’ తదితర చిత్రాలతో అలరించింది. 

చిరంజీవి హీరోగా వస్తోన్న ‘విశ్వంభర’లోనూ ఈ యంగ్‌ బ్యూటీ నటిస్తోంది. ‘బాస్‌తో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం నా అదృష్టం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు’ అని ఇన్‌స్టాలో పోస్టు పెట్టింది.

అడ్వెంచర్లు చేయడం ఈమెకి మహా ఇష్టం. ఎవరెస్ట్ బేస్‌ క్యాంప్‌లో పాల్గొని దాదాపు 9 రోజుల పాటు నడిచి మొత్తానికి శిఖరాన్ని చేరుకుంది. 

This browser does not support the video element.

ప్రకృతిలో గడపడం ఈమెకు నచ్చుతుంది. బీచ్‌లు, కొండ ప్రాంతాలు, అడవుల్లోకి ఎక్కువగా ట్రిప్‌లకు వెళుతుంది.

 ‘మనం ఏది చేస్తే సంతోషంగా ఉంటామో అది చేసెయ్యాలి. నేనొక ఫుడీని. బతికినంత కాలం చక్కగా ప్రకృతిలో తిరుగుతూ, నచ్చిన ఆహారం తింటూ గడిపేస్తాను’ అంటోంది రమ్య.

 ఈమె తరచూ ఫొటోషూట్‌లో పాల్గొంటూ ఆ ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేస్తుంటుంది. గ్లామరస్‌ పోజులతో యువతను కట్టిపడేస్తోంది.  

This browser does not support the video element.

రమ్యకి పెంపుడు జంతువులపై అభిమానం ఓ రేంజ్‌లో ఉంటుంది. వాటికి పుట్టినరోజులు కూడా చేసి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది.

కేన్స్‌లో హాలీవుడ్‌ సొగసులు

‘విశ్వంభర’లో ఆషికా రంగనాథ్‌

సొంత అవుట్‌ ఫిట్‌తో కేన్స్‌కు!

Eenadu.net Home