యాక్షన్‌ మోడ్‌లో ఆండ్రియా

వెంకటేష్ 75వ చిత్రం ‘సైంధవ్‌’తో మరోసారి తెలుగు తెరపై కనిపించేందుకు సిద్ధమైంది.. ఆండ్రియా జెరెమియా. ఈ చిత్రం జనవరి 13న విడుదల కానుంది. 

ఈ చిత్రంలో మరో ఇద్దరు నాయికలున్నారు. శ్రద్ధా శ్రీనాథ్‌, రుహానీ శర్మ. ఈ పాన్‌ ఇండియా మూవీలో ఆండ్రియా ‘జాస్మిన్‌’గా యాక్షన్‌ పాత్రలో అలరించనుంది.

ఇంతకుముందు సునీల్‌, నాగచైతన్య కలిసి నటించిన ‘తడాఖా’తో ఆండ్రియా టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ప్రస్తుతం తమిళంలో ‘పిశాచి 2’, ‘కా’, ‘మాలిగై’, ‘నో ఎంట్రీ’ చిత్రాల షూటింగ్‌తో బిజీగా ఉంది. 

తమిళ్‌, హిందీ, మలయాళ చిత్రాల్లో ఎక్కువగా నటిస్తోంది. యాక్షన్‌, థ్రిల్లర్‌, హారర్‌ పాత్రల్లో తన సహజ నటనతో మెప్పిస్తోంది. ‘యుగానికి ఒక్కడు’తో మంచి పేరు తెచ్చుకుంది.  

ఈమె యాక్టర్‌ మాత్రమే కాదు, మంచి సింగర్‌. ‘బొమ్మరిల్లు’, ‘రాఖీ’, ‘దేశముదురు’, ‘భరత్‌ అనే నేను’ తదితర తెలుగు చిత్రాలతోపాటు తమిళ, మలయాళ చిత్రాల్లోనూ పాటలు పాడింది. మ్యూజిక్‌ ప్రదర్శనలు చేస్తుంటుంది. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ కూడా.

చెన్నైలో పుట్టిన ఆండ్రియా పదేళ్ల వయసు నుంచే సంగీతం నేర్చుకోవడం మొదలుపెట్టింది. అలాగని, చదువును అశ్రద్ధ చేయలేదు. ఎప్పుడూ ఫస్ట్‌ ర్యాంకరే!

‘నేను మానసిక వైద్యురాలిని కావాలనుకున్నాను. నాన్న లాయర్‌ కావడంతో నన్నూ లా చదవమన్నారు. దీంతో న్యాయవిద్యలో చేరాను. కానీ, ఆ కోర్సు నచ్చక మధ్యలోనే వదిలేశా’ అని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది. 

‘చిన్నప్పట్నుంచీ మ్యూజిక్‌ కంపోజ్‌ చేయడం, పాటలు పాడటం అంటే చాలా ఇష్టం. అందుకే, సంగీతాన్ని కెరీర్‌గా మలుచుకున్నా. సినిమాల్లో నటించే అవకాశం రావడంతో యాక్టర్‌నయ్యా’అని చెప్పుకొచ్చింది. 

‘చేపల పులుసు, కొబ్బరి అన్నం ఇష్టంగా తింటా. విహారయాత్రకు వెళ్లాలంటే లండన్‌ నా ఫస్ట్ ఛాయిస్‌. ఖాళీ సమయం దొరికితే పుస్తకాలు చదువుతా.. డ్యాన్స్‌ కూడా చేస్తా’నంటూ తన ఇష్టాలను బయటపెట్టింది.

నాజూగ్గా ఉండేందుకు ఈ బ్యూటీ యోగా చేస్తుంది. ఇంట్లో తయారు చేసిన జ్యూస్‌లకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంది. బరువు అదుపులో ఉండాలంటే ఎక్కువ సమయం జిమ్‌లో ఉండక తప్పట్లేదు అని అంటోంది. 

ఇన్‌స్టాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. మ్యూజిక్‌ వీడియోలు, ఫొటోలను షేర్‌ చేసుకుంటుంది. ఆండ్రియా ఇన్‌స్టా ఖాతాకు 3.3 మిలియన్‌ ఫాలోవర్స్‌ ఉన్నారు. 

Images/andrea jeremiah

కాబోయేవాడు అలాగే ఉండాలి.. కృతి మనసులో మాటలివీ!

చీరల్లో ఉండే గ్రేసే వేరబ్బా: అనన్య నాగళ్ల

చై- శోభితల ప్రేమ ప్రయాణం: పెళ్లి పనులు స్టార్ట్‌

Eenadu.net Home