స్టార్స్‌ వారసుల హీరోయిన్‌!

సరదాగా ఆడిషన్స్‌కు వెళ్లి నటిగా మారిన సాక్షి వైద్య.. ఇప్పుడు టాలీవుడ్‌లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది.

Image: Instagram/Sakshi

అఖిల్‌ అక్కినేని ‘ఏజెంట్‌’తో సాక్షి టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. సినిమా విడుదలకు ముందే ఈ బ్యూటీ యూత్‌లో మంచి క్రేజ్‌ సంపాదించింది. 

Image: Instagram/Sakshi

‘ఏజెంట్‌’ ప్రేక్షకుల్ని నిరుత్సాహపర్చినా సాక్షి మాత్రం.. గ్లామర్‌తో ఆకట్టుకుంది. నటనతోపాటు డ్యాన్స్‌, యాక్షన్‌తో అదరగొట్టింది. 

Image: Instagram/Sakshi

వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా ‘లక్కీ భాస్కర్‌’ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇందులో హీరోయిన్‌గా సాక్షి ఎంపికైంది.

Image: Instagram/Sakshi

ప్రస్తుతం వరుణ్‌తేజ్‌తో ‘గాండీవధారి అర్జున’లో నటిస్తోన్న సాక్షి.. మరో మెగా హీరో సినిమాలోనూ ఛాన్స్‌ కొట్టేసింది. 

Image: Instagram/Sakshi

సాయిధరమ్‌తేజ్‌ హీరోగా బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్‌ ఓ చిత్రాన్ని నిర్మించనున్నారు. అందులో తేజ్‌కు జోడీగా సాక్షిని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. రవితేజ సినిమాలోనూ నటిస్తోంది.

Image: Instagram/Sakshi

మహారాష్ట్రలోని ఠాణెలో జూన్‌ 19, 2000న జన్మించిన ఈ ఏజెంట్‌ సుందరి.. ముంబయిలో డిగ్రీ చేసింది.

Image: Instagram/Sakshi

చదువు పూర్తికాగానే మోడలింగ్‌లో అడుగుపెట్టింది. పలు బ్రాండ్స్‌ ప్రచారచిత్రాల్లో నటించింది. 

Image: Instagram/Sakshi

కొవిడ్‌ సమయంలో సరదాగా టిక్‌టాక్‌, ఇన్‌స్టా రీల్స్‌ చేస్తూ సోషల్‌మీడియాలో పాపులరైంది. 

Image: Instagram/Sakshi

స్నేహితుల ప్రోత్సాహంతో సినిమా ఆడిషన్స్‌లో పాల్గొంటూ.. ‘ఏజెంట్‌’లో హీరోయిన్‌గా ఎంపికైంది.

Image: Instagram/Sakshi

అప్పట్లో సరదాగా ఆడిషన్స్‌కు వెళ్లినా.. ఇప్పుడు హీరోయిన్‌ అయ్యాక.. నటనపై మరింత శ్రద్ధ పెట్టానని గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. 

Image: Instagram/Sakshi

ఈ బ్యూటీకి ట్రావెలింగ్‌ అంటే చాలా ఇష్టం. బ్యాంకాక్‌, శ్రీలంకను చుట్టొచ్చింది. మంచి ఫుడ్డీ.. ఎక్కడికి వెళ్లినా.. అక్కడి రుచులను ఆస్వాదిస్తుంటుంది. 

Image: Instagram/Sakshi

సెలబ్రిటీ లుక్‌: మంజ్రేకర్‌ కొత్త హెయిర్‌స్టైల్‌.. అనన్య స్మైల్‌

చీర రూటే సపరేటు

సోషల్‌లుక్‌: ముగ్ధ మనోహరాలు.. మైమరపించే అందాలు..

Eenadu.net Home