సినిమా కోసం ఇంటిని అమ్మేసుకున్నారు!

‘సలార్‌’తో ప్రభాస్‌ ఫ్యాన్స్‌కి, ఇండియన్‌ సినిమాకు అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ఆయన గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

 ప్రశాంత్‌ నీల్‌ కర్ణాటకకు చెందినవారు. అతని పూర్వీకులు ఆంధ్రప్రదేశ్‌లోని మడకశిర దగ్గర్లోని నీలకంఠాపురం వాసులు.

తొలి సినిమా ‘ఉగ్రం’ హీరో శ్రీమురళి తనకి బంధువు. ప్రశాంత్‌ సోదరినే మురళి వివాహం చేసుకున్నారు. ప్రశాంత్‌ నీల్‌కు టాలీవుడ్‌లో, ఏపీ పాలిటిక్స్‌లో బంధువులు ఉన్నారు. కాంగ్రెస్‌ నేత రఘువీరా రెడ్డి చిన్నాన్న అవుతారు.

సినిమాల్లో ప్రశాంత్‌ రావడానికి తొలి కారణం ప్యాషన్‌ కాదట. డబ్బులు అవసరమై పరిశ్రమలోకి వచ్చారు. అయితే ఆ తర్వాతర్వాత సినిమా మీద ఆసక్తి పెరిగింది.

 ప్రశాంత్‌ తన తొలి సినిమాగా ‘ఆ హుడిగి నీనే’ చేద్దాం అనుకున్నారు. అది వర్కవుట్‌ కాదనుకున్నాక ‘ఉగ్రం’ స్టార్ట్‌ చేశారు.

మహా భారతం నుంచి స్ఫూర్తి పొందుతూ తన సినిమా కథలు ఉంటాయని ప్రశాంత్‌ నీల్‌ చెబుతుంటారు. ‘కేజీయఫ్‌’లో పాత్రలు అందులోంచి పుట్టినవే అనేది ఆయన మాట.

బ్లాక్‌బస్టర్‌ సినిమాలకు సాంకేతిక నిపుణులుగా కొత్త కుర్రాళ్లను తీసుకోవడం అలవాటు. ‘కేజీయఫ్‌’ టీమ్‌లో ఉజ్వల్‌ కులకర్ణి, ‘సలార్‌’ టీమ్‌లో రామగిరి విష్ణు అలా వచ్చినవాళ్లే.

ఇంతటి భారీ సినిమాలు తీసిన ప్రశాంత్‌ నీల్‌ డిగ్రీ కూడా పాస్‌ కాలేదు. గణితంలో పట్టుమని పది మార్కులు కూడా వచ్చేవి కావట.

బ్లాక్‌బస్టర్లు తీస్తున్నారు కదా... అసిస్టెంట్‌ డైరక్టర్‌గా పెద్ద దర్శకుల దగ్గర పని చేశారు అని అనుకుంటున్నారామో! ఆయన ఏ దర్శకుడి దగ్గరా పని చేయలేదు.

హాలీవుడ్‌ సినిమాలు చూసి... ఇలాంటి సినిమా మన కన్నడ సినీ పరిశ్రమకు ఇవ్వాలని ప్రశాంత్‌ అనుకునేవారు. ఇప్పుడు ఏకంగా ఇండియన్‌ సినిమాకే ఇస్తున్నారు.

‘ఉగ్రం’ కోసం ఉన్న ఇంటిని అమ్మేసుకున్నారు . విడుదల విషయంలో ఇబ్బందులు వస్తే నటుడు దర్శన్‌ సాయం చేశారు.

తొలి సినిమాకే ప్రశాంత్‌కు పైరసీ దెబ్బ తగిలింది. ఎంతలా అంటే ఆ సినిమా టీవీ హక్కులు అమ్ముదాం అంటే... అప్పటికే కేబుల్‌ టీవీల్లో వేసేశారు. దీంతో ఈ సినిమాకు రూ. 20 కోట్లు నష్టం వచ్చిందని ఓ సందర్భంలో ప్రశాంత్‌ చెప్పారు.

ఈ హీరోయిన్లు ఏం చదివారో తెలుసా?

క్యాడ్‌బరీ బ్యూటీ.. మూడు సినిమాలతో బిజీ..

స్పెషల్‌ అట్రాక్షన్‌ సీరత్‌ కపూర్‌

Eenadu.net Home