₹500 కోట్ల బడ్జెట్‌.. టవల్‌ ఫైట్‌.. ‘టైగర్‌ 3’ విశేషాలివే!

సల్మాన్‌ ఖాన్‌ - కత్రినా కైఫ్‌ జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్‌ ‘టైగర్‌ 3’. నవంబర్‌ 12న విడుదల కానున్న ‘టైగర్‌ 3’ విశేషాలివే!

‘ఏక్‌ థా టైగర్‌’, ‘టైగర్‌ జిందా హై’ చిత్రాలకు కొనసాగింపుగా మనీశ్‌ శర్మ ‘టైగర్‌ 3’ తీర్చిదిద్దారు.

‘ఫ్యాన్‌’ తర్వాత మనీశ్‌ శర్మ లాంగ్‌ గ్యాప్‌ (ఆరేళ్లకుపైగా) తీసుకొని ఈ సినిమా తెరకెక్కించారు. 

యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా బడ్జెట్‌ రూ.500 కోట్లని అంచనా. 

స్టంట్స్‌ కోసం హాలీవుడ్‌ ప్రముఖ యాక్షన్‌ కొరియోగ్రాఫర్స్‌ మార్క్ స్కిజాక్, క్రిస్ బర్న్స్‌ను తీసుకొచ్చారు.

‘టైగర్‌ 3’లో మొత్తం 12 యాక్షన్‌ సీక్వెన్స్‌లున్నాయి. కత్రినాపై చిత్రీకరించిన టవల్‌ ఫైట్‌ హైలైట్‌గా నిలుస్తుందట.

ఇందులో ఓ పాటలో కత్రినా ఏడు విభిన్నమైన లుక్స్‌లో కనిపిస్తారు.

‘పఠాన్‌’, ‘వార్‌’ చిత్రాల్లోని కొన్ని సంఘటనలతో ఈ చిత్రానికి సంబంధం ఉందని బాలీవుడ్‌ వర్గాల సమాచారం.


ఈ సినిమాలో షారుఖ్‌ ఖాన్‌ అతిథి పాత్రలో కనిపిస్తారు. హృతిక్‌ రోషన్‌ కూడా ఉన్నారని టాక్‌. 

ఇమ్రాన్‌ హష్మీ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ముగ్గురు హీరోలు, ఇమ్రాన్‌ ఉన్న యాక్షన్‌ సీక్వెన్స్‌ విదేశాల్లో చిత్రీకరించారట. 

వైఆర్‌ఎఫ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌లో ఈ సినిమా ఓ భాగం. త్వరలో తెరకెక్కే ‘వార్‌ 2’ కూడా ఇందులోనిదే అంటున్నారు.

ఆయనే నా డ్యాన్స్‌ టీచర్‌

మేనమామే అయినా 17 సార్లు ఆడిషన్‌ ఇచ్చింది!

యూట్యూబ్‌ నుంచి కేన్స్‌ దాకా..

Eenadu.net Home