సంజీదా షేక్.. బీటౌన్‌లో హాట్ టాపిక్!
బాలీవుడ్.. తెలుగు హీరో హర్షవర్ధన్ రాణె.. నటి సంజీదా షేక్‌తో డేటింగ్‌లో ఉన్నాడంటూ మరోసారి రూమర్స్ వెల్లువెత్తాయి. దీంతో సంజీదా షేక్ బీటౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Image: Instagram/Sanjeeda Shaikh
ఈ బ్యూటీకి ఇది వరకే నటుడు ఆమిర్ అలీతో వివాహమై.. రెండేళ్ల కుమార్తె కూడా ఉంది. అలీతో ఇటీవల విడాకులు తీసుకున్న సంజీదా.. హర్షవర్ధన్‌తో ప్రేమలో పడ్డట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
Image: Instagram/Sanjeeda Shaikh
గతంలోనే సంజీదా.. ఈ రూమర్స్‌ను ఖండించినా.. జూన్‌లో వీరిద్దరూ గిర్ ఫారెస్ట్‌లో వెళ్లినట్లు వీరి సోషల్‌మీడియా ఖాతాల్లో పోస్టులు చూస్తే తెలుస్తోంది. దీంతో మళ్లీ ఈమె వార్తల్లో నిలిచింది.
Image: Instagram/Sanjeeda Shaikh
కువైట్‌లో డిసెంబర్ 20, 1984న జన్మించిన ఈ భామ.. నటనపై ఆసక్తితో భారత్‌కు వచ్చేసింది. సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేసింది.
Image: Instagram/Sanjeeda Shaikh
అలా 2003లో ‘భాగ్‌బాన్’లో చిన్న పాత్ర పోషించే అవకాశం దక్కింది. రెండేళ్ల తర్వాత తమిళ చిత్రం ‘పొన్నియిన్ సెల్వన్(2005)’లోనూ గెస్ట్ రోల్‌లో కనిపించింది.
Image: Instagram/Sanjeeda Shaikh
హిందీ సీరియల్ ‘క్యా హోగా నిమ్మో కా’తో పూర్తిస్థాయి నటిగా మారింది సంజీదా. ఆ తర్వాత ‘జానే పెహ్‌చానే సే యా అంజాబీ’, ‘పియా కా ఘర్ ప్యారా లగే’, ‘ఇష్క్ కా రంగ్ సఫేద్’ తదితర సీరియళ్లలో నటించి బుల్లితెర ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది.
Image: Instagram/Sanjeeda Shaikh
‘నాచ్ బాలియే’, ‘జర నాచ్‌కే దిఖావ్’, తదితర రియాల్టీ డ్యాన్స్ షోల్లో పాల్గొని సత్తా చాటింది. అలా బాలీవుడ్‌ను ఆకర్షించింది.
Image: Instagram/Sanjeeda Shaikh
‘ఫంక్’తో హిందీ చిత్రసీమలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. కన్నడ, పంజాబీ సినిమాల్లోనూ మెరిసింది. 2020లో హర్షవర్ధన్‌తో కలిసి ‘తైష్’లో నటించింది.
Image: Instagram/Sanjeeda Shaikh
‘గెహ్రియాన్’ వెబ్‌సిరీస్‌తోపాటు.. పలు మ్యూజిక్ ఆల్బమ్స్‌లోనూ సంజీదా తళుక్కుమంది. ప్రస్తుతం ‘కున్ ఫయా కున్’, ‘ఫైటర్’ చిత్రాలతోపాటు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరామండీ’లోనూ నటిస్తోంది.
Image: Instagram/Sanjeeda Shaikh
This browser does not support the video element.
సోషల్‌మీడియాలో యాక్టివ్‌గా ఉండే 38 ఏళ్ల సంజీదాకు ఇన్‌స్టాలో 4.5 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. తరచూ తన గ్లామర్ పిక్స్, వీడియోలు పోస్ట్ చేస్తూ ‘ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే’ అంటోంది.
Video: Instagram/Sanjeeda Shaikh